'హసీనా' కోసం హోం వర్క్ చేస్తున్న శ్రద్ధా

0

shraddha-kapoor-apdunia‘రాక్ ఆన్-2’ తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్‌ యువనటి శ్రద్ధాకపూర్ చేస్తున్న లేటెస్ట్ పిక్చర్ ‘హసీనా’. ఈ చిత్రం కోసం అమ్మడు ముంబయి అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం కుటుంబాన్ని కలిసింది. సినిమాకి మాఫియా డాన్ ఫ్యామిలీకి సంబంధం ఏంటనుకుంటున్నారా? ‘హసీనా’ మూవీ దావూద్‌ సోదరి హసీనా పార్కర్‌ జీవిత విశేషాల ఆధారంగా తెరకెక్కబోతోంది. టైటిల్‌ రోల్‌ను శ్రద్ధా పోషిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో పాటు శ్రద్ధాకపూర్‌.. హసీనా ఆమె ముగ్గురు పిల్లలను కలిసింది.

దావూద్‌ కుటుంబం చాలా సహకరిస్తున్నారని హసీనా నుంచి ముక్కుపుడకతో పాటు కొన్ని వస్తువులు కూడా తీసుకున్నట్లు శ్రద్ధా తెలిపింది. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ముంబయి మురికివాడల అభివృద్ధికి హసీనా చేసిన కృషి, స్లమ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీస్‌ డీలింగ్స్‌ గురించి తెరపై చూపించబోతున్నారు. సినిమా కోసం దావూద్‌ కుటుంబం గురించి తెలుసుకోవడానికి చిత్రబృందం మరోసారి డిసెంబర్‌లో వారితో సమావేశం కానుంది. ఈ సినిమాలో శ్రద్ధా సోదరుడు సిద్ధాంత్‌ కపూర్‌ కూడా నటిస్తున్నాడు. ఇందులో సిద్ధాంత్‌ దావూద్‌ పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

Share.

Comments are closed.