ఖలిద్ పై కాల్పులు.. సురక్షితంగా బయటపడ్డ ఖలిద్

జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖాలిద్ పై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. అయితే ఖాలిద్ గాయపడకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీలోని కన్స్టిట్యూషన్ క్లబ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అంతేకాక పార్లమెంటు స్ట్రీట్ సమీపంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాల్సులు జరిపిన తరువాత ఆగంతకుడు పరారైయ్యాడు. టార్గెట్ మిస్ అయిందని తెలుసుకున్న ఆగంతకుడు పక్కా ప్లాన్ ప్రకారం తప్పించుకున్నాడు. అయితే క్లబ్ ఆవరణంలో సీసీ కెమెరాల ఉండటంతో ఆగంతకుడ్ని గుర్తించడం పెద్ద కష్టం కాదని పోలీసు అధికారులు తెలిపారు. ఆగంతకుడు ఉపయోగించిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com