ట్వీట్స్ ద్వారా రూ.30 లక్షలు సంపాదించిన సెహ్వాగ్

0

sehwag1_apduniaఇండియన్ మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తన ట్వీట్స్ ద్వారా ఆరునెలల్లో రూ.30 లక్షలు సంపాదించాడు. ఈ విషయాన్ని సెహ్వాగ్ స్వయంగా ప్రకటించాడు. ప్రస్తుతం ఆయన తన ట్వీట్ ల ద్వారానే భారీగా ఆదాయాన్ని పొందుతున్నాడట. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని వెల్లడించాడు. సమకాలీన విషయాలపై, సెలబ్రిటీలపై ఈ వీరేంద్రుడు అత్యంత సులువుగా ట్విట్టర్ ద్వారా ఛలోక్తులు విసురుతాడు. తన ట్వీట్ లను చూసి రణవీర్ గతంలో పగలబడి నవ్విన విషయాన్ని సెహ్వాగ్ గుర్తు చేశారు. సెహ్వాగ్ ట్విట్టర్ లో వేసే ఛలోక్తుల కోసం ఎదురుచూసే అభిమానులు ఉన్నారంటే అవి ఎంత ప్రభావం చూపుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. తన ట్వీట్స్ వైరల్ గా మారినపుడు స్పాన్సర్ లు వారంతట వారే వచ్చి తనని సంప్రదిస్తారని అన్నాడు. తన ట్వీట్స్ కి వేల సంఖ్యలో రీట్వీట్స్ వస్తాయని పేర్కొన్నాడు. అభిమానులకు తనట్వీట్స్ ద్వారా ఆనందాన్ని పంచుతూనే సెహ్వాగ్ డబ్బు కూడా సంపాదిస్తున్నాడన్న మాట.

Share.

Comments are closed.