"సోగ్గాడి" గదిలో యంగ్ హీరోయిన్

0

Seerat-Kapoor_apduniaతెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బాలీవుడ్ భామ సీరత్ కపూర్. ‘రన్ రాజా రన్’ చిత్రంతో ఈ అమ్మడు వెండితెరపై మెరిసింది. ఈ చిత్రం మంచి సక్సెస్ కావడంతో తెలుగులో ఫుల్ బిజీ అయిపోతాను అనుకుంది. సందీప్ కిషన్‌తో ‘టైగర్’ మూవీ మాత్రమే చేయగలిగింది. ఆ మూవీ ఫ్లాప్ కావడంతో సీరత్‌కి ఆఫర్లు రాలేదు. దాంతో ముంబై వెళ్ళి యాడ్ ఫిల్మ్స్ చేసుకుంటోంది. అయితే సీరత్‌ని టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఉన్నట్టుండి తన గదిలోకి పిలిచాడు. దీంతో ఈ అమ్మడు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాగార్జున హీరోగా ఓంకార్ డైరెక్షన్‌లో ‘రాజుగారి గది 2’ రీసెంట్‌గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ‘ఊపిరి’ సినిమా తర్వాత పివిపి నాగార్జునతో ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తోంది. నాగార్జున ఈ మూవీలో మోడ్రన్ మాంత్రికుడిగా కనిపించనున్నాడట. ఈ మూవీలో హీరోయిన్‌గా సీరత్ కపూర్‌ని ఓకే చేశారని టాక్. ‘టైగర్’ ఫ్లాప్‌తో ఆఫర్లు లేక ముంబై వెళ్ళిపోయిన సీరత్‌కి ఇది నిజంగా బంపర్ ఆఫర్ వంటిదే.

Share.

Comments are closed.