స‌త్యం రామ‌లింగ‌రాజుపై మ‌రో పిడుగు

0

స‌త్యం కంప్యూట‌ర్స్ కుంభ‌కోణం దాదాపు ద‌శాబ్దం క్రితం అవిభాజ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఓ కుదుపు కుదిపేసిన విష‌యం తెలిసిందే. ఆ కుంభ‌కోణం కార‌ణంగా సత్యం రామ‌లింగ‌రాజు దేశ‌ వ్యాప్తంగా అప‌కీర్తిని మూట‌గ‌ట్టుకున్నారు. కానీ ఎన్ని అఆంత‌రాలు వ‌చ్చినా…ఎంత మంది రాజ‌కీయ నాయ‌కులు త‌న నుంచి డ‌బ్బు దండుకోవాల‌ని చూసినా కించిత్ కూడా చెక్కు చెద‌ర‌ని ఆత్మ‌స్థైర్యంతో ముంద‌డుగేశాడు..చివ‌రికి జైలు జీవితాన్ని కూడా అనుభ‌వించిన ఆయ‌న‌పై తాజాగా మ‌రో పిడుగు పిడింది.స‌త్యం కుంభ‌కోణంపై తాజాగా సెబి(సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజి బోర్డు) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. 14 ఏళ్ల పాటు స‌త్యం వ్య‌వ‌స్థాప‌కుడైన స‌త్యం రామ‌లింగ‌రాజు 14 ఏళ్ల పాటు సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజీస్ లో కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌కుండా నిషేధాన్ని విధించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న‌తో పాటు ఆయ‌న సోద‌రులు బి. రామ‌రాజు, బి. సూర్య‌నారాయ‌ణ‌రాజు, ఎస్ ఆర్ ఎస్ ఆర్‌ హోర్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ల‌కు కూడా ఆదేశాలు జారీచేసింది. ఈ సంస్థ‌లు చ‌ట్ట వ్య‌తిరేకంగా సంపాదించిన సొమ్మును గ‌తంలో రూ. 1,258.88 కోట్లుగా నిర్ణ‌యించిన సెబీ తాజాగా దాన్ని 813.40 కోట్ల‌కు త‌గ్గించింది.దీనిలో ఎవ‌రెవ‌రు ఎంతెంత సొమ్మును చెల్లించాల‌నే లెక్క‌ను కూడా సెబి తాజాగా వెల్ల‌డించింది. ఎస్ ఆర్ ఎస్ ఆర్‌ హోర్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.675.39 కోట్లు కాగా, సూర్య‌నారాయ‌ణ‌రాజు రూ. 81.84 కోట్లు, బి. రామ‌రాజు రూ. 29. 54 కోట్లు, స‌త్యం రామ‌లింగ‌రాజు రూ. 26.62 కోట్లు చెల్లించాల‌ని తేల్చి చెప్పింది. ఫైన‌ల్‌గా తేల్చిన సొమ్మును 45 రోజుల్లోగా డిపాజిట్ చేయాల‌ని సెబీ స‌త్యం రామ‌లింగ‌రాజు అండ్ కోను ఆదేశించ‌డం ఆస‌క్తిగా మారింది.

Share.

About Author

Leave A Reply