సాయి పల్లవి చాలా ప్రొఫెషనల్ నటి

0

‘ప్రేమమ్‌’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. కాగా టాలీవుడ్‌లో ఈ భామ శర్వానంద్ సరసన ‘పడి పడి లేచే మనసు’ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా సెట్స్‌లో సాయి పల్లవి తీరుపై చాలా రూమర్లే ఉన్నాయి. సెట్స్‌కు ఆలస్యంగా వెళుతుందని, ఎవ్వరితో కలవదని పలు రకాలు రూమర్లు వచ్చాయి. అంతేకాదు ఆమెపై ఓ హీరో డైరక్ట్‌గా కామెంట్లు కూడా చేశాడు. ఇలాంటి నేపథ్యంలో సాయి పల్లవి గురించి శర్వానంద్ పాజిటివ్‌గా స్పందించారు. సాయి పల్లవి చాలా ప్రొఫెషనల్ నటి అని శర్వానంద్ కితాబు ఇచ్చారు. స్క్రిప్ట్ ని పూర్తిగా అర్థం చేసుకున్నాకే ఆమె సెట్స్ మీదకు వెళ్తుందని, అలాంటి హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. అంతేకాదు ఆమె ఇంటలిజెంట్ నటి అంటూ కూడా శర్వా ప్రశంసలు కురిపించాడు.

Share.

About Author

Leave A Reply