పేద విద్యార్థినులకు సంతూర్ స్కాలర్షిప్ లు సెప్టెంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలి

ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో విద్యనభ్యసించి, ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించడానికి సంతూర్ ఇచ్చే ఆర్ధిక సహాయం కోసం సెప్టెంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని విప్రో కన్స్యూమర్ కేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనిల్ ఛుగ్ కోరారు. రాష్ట్రం లో ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఉన్నత విద్యను అభ్యసించడానికి సంతూర్ స్కాలర్షిప్స్ డాట్ కాం వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసి ఆర్ధిక సాయం పొందవచ్చినన్నారు. విద్యార్థినులకు అండగా ఉండేలా వెనుకబడిన కుటుంబాల వారికీ ఇచ్చే సంతూర్ స్కాలర్షిప్ ల కోసం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విప్రో కన్స్యూమర్ కేర్ సామాజిక బాధ్యత కింద 2016 లో ఈ స్కాలర్షిప్ ప్రొగ్రాము కి శ్రీకారం చుట్టిందని మూడు రాష్ట్రాల నుంచి ఏటా 900 మంది విద్యార్థులకు ఈ సహకారం అందిస్తున్నామన్నారు. ఒక్కో విద్యార్థికి ఏటా 24 వేల రూపాయల చొప్పున మూడు సంవత్సరాలు ఈ స్కాలర్షిప్ అందిస్తున్నామని తెలిపారు. మూడు రాష్ట్రాల్లో గత 2 ఏళ్లలో 1800 యువతులు ఏ స్కాలర్షిప్ పొంది ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్టు తెలిపారు. ఇమెయిల్ లో వివరాలు పొందాలనుకునే వారుsantoor.scholarship@buddy4study.com, ఫోన్ నెంబర్ 01206834200, వెబ్ సైట్ :www.santoorscholarships.com నందు సంప్రదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com