విశాఖ వేదికగా ఆర్ఎస్ఎస్,విహెచ్ పి,భజరంగ్ దళ్ సమావేశాలు

దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) – విశ్వహిందూ పరిషత్ ( విహెచ్ పి ) – భజరంగ్ దళ్ భారతీయ జనతా పార్టీల

ఉమ్మడి కార్యాచరణ సమావేశాలు ఈ నెలఖరు లోగా జరగనున్నాయి.ఖచ్చితమైన తేదిలు ఖరారు కావలసి ఉంది. ఈ సమావేశాలకు విశాఖ వేదిక కావడం చర్చనీయాంశం. ఆంధ్రప్రదేశ్ లో

భారతీయ జనతా పార్టీ విస్తరించాలనుకోవడం అక్కడ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని అణగదొక్కాలను కోవడం బిజేపీ వ్యూహం. ఇందులో భాగంగానే ఈ కీలక సమావేశాన్ని

విశాఖపట్నంలో నిర్వహిస్తునట్టు సమాచారం.ఈ సమావేశాలకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆర్ ఎస్ ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ లతో పాటు ఆర్ ఎస్ ఎస్ ప్రదాన కార్య దర్శి సురేష్

బయ్యాజీ,అగ్ర నేతలు కృష్ణ గోపాల్,దత్తాత్రేయ సోహబలే,సురేష్ సోని, తదితరులు హజరు కాన్నారు.దేశవ్యాప్తంగా దళితుల నుంచి వస్తున్న వ్యతిరేకతలపై ముందుగా చర్చిస్తారు. అలాగే కశ్మీర్ లో

మెహబూబ ముఫ్తీ సర్కారు నుంచి వైదొలగడం – ప్రాంతీయ రాజకీయాలు – నక్సలిజం వంటి అంశాలపై కీలక చర్చలు చేస్తారు. అలాగే కేంద్రంలో బిజేపికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి

కడుతున్న ప్రతిపక్షాల వ్యూహాలపై కూడా చర్చించనున్నారు. త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలపై వ్యూహరచన చేసే అవకాశం ఉంది. దేశంలో వచ్చే ఏడాది జరుగనున్న

సార్వత్రిక ఎన్నికలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. దేశ వ్యాప్తాంగా జరుగుతున్న మూక దాడులు – హత్యలు.. వాటి ప్రభావం తమపై ఎలా ఉందన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.

ఈ సమావేశం అనంతరం దేశంలోను అంతర్జాతీయంగాను తీసుకోవాల్సిన చర్యలు రాజకీయ మార్పులపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలోనే ప్రధాని అభ్యర్ది నిర్ణయం…? విశాఖలో

జరగనున్న హిందుత్వ సమావేశంలో ఓ కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. అదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రధాని అభ్యర్ది ఎవరు అన్నదే.

ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్ ఎస్ ఎస్ తో సహా విహేచ్ పి – భజరంగ్ దళ్ లోని ఓ బలమైన వర్గం తీవ్ర అసంత్రుప్తిగా ఉంది. నరేంద్ర మోదీ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ప్రజలను

హిందూత్వకు దూరం చేస్తున్నాయంటోంది ఆ వర్గం. దీంతో వచ్చే ఎన్నికలలో నరేంద్ర మోదీ స్థానంలో ఎవరు ప్రధానిని చేయాలో నిర్ణయిస్తారు. ఈ రేసులో కేంద్ర మంత్రి నితిన్ గట్కరి – బిజేపి

జాతీయ ప్రధాన కార్యదర్శి – ఆంధ్రప్రదేశ్ కు చెందిన రామ్ మాధవ్ ఉన్నారు. అయితే ప్రధానిగా నరేంద్ర మోదీకి మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రధాని ఎవరు అనే

అంశంపై తీవ్ర చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *