ఫోన్‌ రిపేర్‌కు ఇస్తే …91వేలు మాయం

0

ఫోన్ పాడైందని రిపేర్‌కి ఇచ్చిన పాపానికి మొబైల్ పేటీఎం వ్యాలెట్ నుంచి రూ. 91 వేలను కాజేశాడు ఓ టెక్నీషియన్.ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని కల్కజీ ప్రాంతానికి చెందిన యూసఫ్‌ కరీమ్‌ ఫోన్ రిపేర్‌కి రావడంతో దాన్ని సర్వీస్‌ సెంటర్‌లో ఇచ్చారు. మెబైల్‌ను రిపేర్ చేసిన తర్వాత వారు దాన్ని తిరిగి యూసఫ్‌‌కు ఇచ్చారు. ఇంతలో అతనికి ఓ మెయిల్ వచ్చింది. అపరిచిత వ్యక్తులు తన పేటీఎం అకౌంట్లోకి లాగిన్‌ అయ్యారని, కొన్ని లావాదేవీలు కూడా చేశారని ఆ మెయిల్‌లో ఉంది.వెంటనే యూనిఫ్ తన తన పేటీఎం అకౌంట్ చెక్ చేసుకోగా దాదాపు 91వేలు వరకు లావదేవిలు జరిగినట్లు,
కరీమ్ అనే వ్యక్తి ఖాతాలోకి ఈ డబ్బులు బదిలీ అయినట్లుగా గుర్తించాడు.దీంతో యూసఫ్‌ పోలీసులను ఆశ్రయించాడు.సర్వీస్‌ సెంటర్‌లో పనిచేసే ఉద్యోగులే తన డబ్బులను మాయం చేసినట్లు కరీమ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై పేటీఎంను ఎన్నిసార్లు వివరణ కొరిన సరిగా ప్పందించలేదాని ఆరోపించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share.

About Author

Leave A Reply