సాక్షి టీవీ కోసం చిరును ఇంటర్వ్యూ చేసిన రోజా

0

chiru-roja_apduniaరాజకీయాల్లో వారిద్దరు ప్రత్యర్థులు. రాజకీయాల్లో ఉన్నంతవరకు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. వీరిద్దరిలో ఒకరు రాజకీయాలకు స్వస్తి చెప్పి, మళ్లీ వెండితెరపై రీఎంట్రీ ఇచ్చారు. మరొకరు రాజకీయాల్లో కొనసాగుతూ.. బుల్లితెర కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. వారిద్దరు ఇపుడు మళ్లీ ముఖాముఖీ తలపడనున్నారు. వారిద్దరే మెగాస్టార్ చిరంజీవి, రోజా. ఈ సంక్రాంతి బరిలో చిరంజీవి నటించిన చిత్రం “ఖైదీ నంబర్ 150” విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్‌ వివిధ రకాలుగా చేస్తున్నారు. అదే సమయంలో పెద్ద సినిమాలు రిలీజయ్యే సమయంలో వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటు ఎలక్ట్రానిక్ మీడియా బిజీగా మారడం చూస్తూనే ఉన్నాం. సంక్రాంతికి రిలీజయ్యే చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ కోసం సాక్షి టీవీ ఛానెల్ ఓ ఫన్ ఇంటర్వ్యూ చేసిందట. ఈ ఇంటర్వ్యూను వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా చేయడం గమనార్హం. చిరంజీవితో వన్ టు వన్ ఇంటర్వ్యూ కోసం ఆమెనే సాక్షి ప్రయోగించింది. ఈ ముఖాముఖి ఇంటర్వ్యూలో కేవలం “ఖైదీ” సినిమా విశేషాలపై రోజా ప్రశ్నలు సంధిస్తారా? లేక నాటి రాజకీయాలతో పాటు తమపై చేసిన ఆరోపణలపై కూడా ప్రశ్నలు సంధిస్తారా అన్నది ఇపుడు ఆసక్తిగా మారింది.

Share.

Comments are closed.