రోజా ఆగట్లేదుగా!.

0

ఆంధ్రప్రదేశ్ లోని మొన్న జగన్ మీద జరిగిన దాడి ఎంతటి సంచలనానికి దారి తీసిందో అందరికి తెలుసు.ఆ ఒక్క కారణంతోనే వైసీపీ నేతలు టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో కూడా తెలుసు, అయితే తాజాగా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాం అని చేసినటువంటి ప్రకటన వైసీపీ క్యాడర్ కు మరింత బలాన్ని చేకూర్చిందనే చెప్పాలి.తెలంగాణా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు చంద్రబాబు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల తీవ్ర స్థాయి విమర్శలు చేస్తున్నారు.కాంగ్రెస్ కు వ్యతిరేఖంగా పుట్టిన పార్టీనే చంద్రబాబు తన స్వార్ధ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసారని మిగతా పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు తాజాగా వైసీపీ మహిళా నేత రోజా మరింత స్థాయిలో తన ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నారు.టీడీపీ మరియు కాంగ్రెస్ పార్టీలు కలవడం వెనుక బాబు యొక్క పెద్ద కుట్రే ఉందని,ఈ రెండు పార్టీలు కలవడానికి వారధిగా ఆయన కోడలు నారా బ్రాహ్మణిని ఉపయోగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతే కాకుండా కాంగ్రెస్ మరియు టీడీపీ పొత్తు చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారు అని మండిపడ్డారు.ఇప్పుడు టీడీపీ నేతలు చంద్రబాబుని ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమయ్యిందని,చంద్రబాబు యొక్క చొక్కాని పట్టుకొని నిలదియ్యండి అని,దాదాపు నలభై సంవత్సారాలు వ్యతిరేఖంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో ఎలా జత కట్టి ఎన్నికలకు వెళ్తున్నావని మండిపడ్డారు.

Share.

About Author

Leave A Reply