ర‌హ‌దారుల‌ను యుద్ద‌ప్రాతిప‌దిక‌న మ‌ర‌మ్మ‌తులు రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి తుమ్మ‌ల ఆదేశించారు

రాష్ట్రంలో ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న ర‌హ‌దారుల‌ను యుద్ద‌ప్రాతిప‌దిక‌న మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాల‌ని రోడ్లు భ‌వ‌నాల శాఖ అధికారుల‌ను మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మంగ‌ళ‌వారం ఆదేశించారు. ఎర్ర‌మంజిల్ లోని ఈఎన్‌సీ కార్యాల‌యంలో వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న ర‌హ‌దారుల‌పై మంత్రి అధికారుల‌తో ఈ రోజు తేది:21.08.2018 నాడు స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… భారీ వ‌ర్షాల‌కు రాష్ట్రంలో చాలా ర‌హ‌దారులు దెబ్బ‌తిన్నాయ‌న్నారు. దెబ్బ‌తిన్న ర‌హ‌దారుల‌కు సంబంధించిన నష్టాన్ని వెంట‌నే అంచ‌నా వేసి ప్ర‌భుత్వానికి నివేదిక‌లివ్వాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. అధికారులంతా ఎక్క‌డిక‌క్క‌డ స్థానికంగా ఉంటూ…ఎప్ప‌టిక‌ప్ప‌డు ప‌ర్య‌వేక్షించి ప్ర‌జ‌ల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చూడాల‌ని అన్నారు. రాజ‌ధానిలో రోజురోజుకు పెరుగుతోన్న ట్రాఫిక్ ర‌ద్దీ ద్రుష్ట్యా ప్‌అస్తుత‌మున్న అవుట్ రింగ్ రోడ్‌కు అద‌నంగా రీజిన‌ల్ రింగ్ రోడ్‌ను నిర్మించాల‌ని ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. నిర్మించ త‌ల‌పెట్టిన రీజ‌న‌ల్ రింగ్ రోడ్డును ఎక్స్ ప్రెస్ హ్రైవేగా మార్చ‌డానికి సీఎం కేసీఆర్ స్వ‌యంగా కేంద్ర‌మంత్రితో సంప్ర‌దింపులు జ‌రిపారు. ఆ సంప్ర‌దింపులు నేడు ఫ‌లితాల‌నిచ్చాయి. రీజ‌న‌ల్ రింగ్ రోడ్ ను ఎక్స్ ప్రెస్ హైవేగా మార్చ‌డానికి కేంద్రం సూచ‌న ప్రాయంగా అంగీక‌రించింది. దీంతో ఇందుకు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌లు యుద్ద‌ప్రాతిప‌దిక‌న సిద్దం చేసి కేంద్రానికి పంపాల‌ని రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అధికారుల‌ను ఆదేశించారు. అలాగే 2018-19 ఆర్దిక సంవ‌త్స‌రానికి గాను కేంద్ర ర‌హ‌దారుల నిధి నుంచి 668.48 కి.మీ నిడివి గ‌ల రూ.800కోట్ల నిధుల‌తో 53 ప‌నులు మంజూరు కావ‌డం జ‌రిగింది. ఈ ప‌నుల‌కు సంబంధించి త్వ‌ర‌గా అంచ‌నాల‌ను రూపొందించి టెండ‌ర్లు ఖ‌రారు చేయాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. అలాగే ఈ నిధులు మంజూరైన 24 నెల‌ల్లోనే టెండ‌ర్ ప్ర‌క్రియ‌తో స‌హ ప‌నులు పూర్తి చేయాల‌ని మంత్రి అధికారుల‌కు గుర్తు చేశారు. లేనిప‌క్షంలో ఈ నిధులు వినియోగించుకునే ప‌రిస్థితి ఉండ‌ద‌ని, దీన్ని ద్రుష్టిలో పెట్టుకొని అధికారులు వేగంగా ప‌నులు చేయాల‌ని ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వ‌ర్షాల‌కు కొన్ని చోట్ల లో లెవ‌న్ వంతెన‌లు కొట్టుకుపోయిన అంశం కూడా స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీంతో బెయిలీ బ్రిడ్జిల గురించి మంత్రి అధికారుల‌ను అరా తీశారు. భారీ వ‌ర్షాల కురిసి వంతెన‌లు కూలిపోవ‌డం, కొట్టుకుపోవ‌డం జ‌రిగిన‌ప్పుడు తెగిపోయిన చోట రెండు రోడ్ల‌ను క‌లిపేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసేవే బెయిలీ బ్రిడ్జిలు. వీటిని ఉమ్మ‌డి రాష్ట్రంలో ప‌లు చోట్ల ఉప‌యోగించిన విష‌యాన్ని మంత్రి అధికారుల‌కు గుర్తు చేశారు. దీనివ‌ల్ల వెంట‌నే వంతెల‌ను కూలిపోయి, కొట్టుకుపోయిన చోట ప్ర‌జ‌ల‌కు అసౌక‌ర్యం క‌ల్గ‌కుండా ర‌హ‌దారుల‌ను క‌ల‌ప‌వ‌చ్చ‌ని మంత్రి అన్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కూడా ఎక్క‌డైన బెయిలీ బ్రిడ్జిలు ఉన్నాయో తెలుసుకోవాల‌ని మంత్రి ఆదేశించారు. లేక‌పోతే భ‌విష్య‌త్ అవ‌స‌రాల ద్ర‌ష్ట్యా ఇటువంటి బ్రిడ్జిల‌ను రూపొందించుకోవాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. పూర్తిగా ఐర‌న్తో త‌యారు చేసే ఈ బెయిలీ బ్రిడ్జిల‌ను త‌క్కువ స‌మ‌యంలోనే త‌యారుచేసుకోవ‌చ్చ‌ని, అవ‌స‌ర‌మైతే ఏడాది పాటు వీటిని తాత్కాలికంగా వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంద‌ని మంత్రి అన్నారు. కాబ‌ట్టి వెంట‌నే బెయిలీ బ్రిడ్జిల‌ను అవ‌స‌రాల మేర‌కు త‌యారు చేయించుకుని స్టాకు పెట్టుకోవాల‌ని మంత్రి ఆదేశించారు. దీంతో రోడ్ల వంతెన‌లు దెబ్బ‌తిన్నా… యుద్ద ప్రాతిప‌దిక‌న బాగు చేసుకోవ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com