పోటెత్తిన కుందు నది వరద.. ఉప్పొంగిన వాగులు వంకలు నీట మునిగిన వరి పంట

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ముందున్నది భారీగా నీరు విడుదల చేయడంతో కోయిలకుంట్ల సబ్ డివిజన్లోని పలు వాగులు గురువారం ఉప్పొంగే ప్రవహించాయి కుందు నది కి అనుసందానం ఉన్న కోయిలకుంట్ల మండలంలోని వల్లంపాడు లింగాల కలుగొట్ల భీమునిపాడు పొట్టిపాడు గుల్లదుర్తి గ్రామాలలో వరద నీరు పొంగి ప్రవహిస్తుండడంతో నది సమీపంలో ఓరి పైర్లు మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఒక్కొక్క రైతుకు ఎకరాకు పదివేల రూపాయల పెట్టుబడి నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు కుందు నది లో వరద ఉధృతి కారణంగా పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి కుందు నది వెంట వ్యవసాయ మోటార్లు నీటిలో మునిగిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు
కోయిలకుంట్ల సబ్ డివిజన్ పరిధిలో 200 ఎకరాలు వరి పంట నీట మునగడంతో దీని పై ఆశలు పెట్టుకున్న రైతులు నిరాశకు గురవుతున్నారు పెట్టిన పెట్టుబడి మొత్తం నీట మునిగిందని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com