మళ్లీ చక్రం తిప్పనున్న రీజనల్ పార్టీలు

ఆ రెండింటికంటే వాళ్లే దేశంలో బలంగా ఉన్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు వచ్చే ఎన్నికల్లో పెద్దగా సత్తా చూపించలేకపోతాయన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నాలుగున్నరేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నా పేద, మధ్యతరగతి జీవులకు ఉపయోగపడిందేమీ లేదు. పెద్దగా మోదీ సర్కార్ పై అవినీతి ఆరోపణలు లేకపోయినా ప్రభుత్వంపై ఒకరకమైన అసహనం కన్పిస్తుందంటున్నారు. నోట్ల రద్దు విషయం ఇప్పుడిప్పుడే కొంత తెరమరగువుతుంది. నోట్ల కష్టాలు చాలా వరకూ తీరాయి. అయితే జీఎస్టీ బాదుడును మాత్రం జనాలు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉంటుందన్నది అందరూ అనుకుంటున్నారు. కానీ అలా ఉండదన్నది వివిధ సంస్థల సర్వేల ద్వారా స్పష్టమవుతుంది. రెండు కూటములకు చెందని ఇతర పార్టీలే వచ్చే ఎన్నికల్లో కీలకం కానున్నాయి.రెండు పార్టీలూ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. బీజేపీ, కాంగ్రెస్ లు ఇతర పార్టీల మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 2004, 2009 లో యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలను చూశాం. అయితే 2014 ఎన్నికలకు వచ్చే సరికి బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. గత ఎన్నికల్లో బీజేపీకి 282 స్థానాలు దక్కాయి. మొత్తం లోక్ సభలో 543 స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 272. గత ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కు మించి సీట్లు వచ్చినా తమకు మద్దతు ఇచ్చిన ఇతర పార్టీలను మంత్రివర్గంలోకి చేర్చుకుంది. తద్వారా ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చింది. తాజాగా కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడమూ కష్టమేనని తేలింది. ఇండియా టుడే -కార్వీ ఇన్ ఇన్ సైట్స్ సంస్థలు చేపట్టిన సర్వేలో బీజేపీ, కాంగ్రెస్ లకు షాక్ తగిలే ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీఏకు 281 స్థానాలు లభిస్తాయని ఈ సర్వే తేల్చింది. అలాగే యూపీఏ కూటమికి 122 స్థానాలు వస్తాయని తేల్చింది. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడించిన ఈ ఫలితాలు కొంత ఆశ్చర్యకరంగా కన్పిస్తున్నా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి నిజమనుకోక తప్పడం లేదంటున్నారు పరిశీలకులు.ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటంతో ఈసారి రీజనల్ పార్టీలదే హవా అని ఈ సర్వేలను బట్టి తెలుస్తోంది. ఈసర్వేలో ఇతరులకు 140 స్థానాలు లభిస్తాయని సర్వే తేల్చింది. అంటే ఎన్డీఏ, యూపీఏ కూటములకు చెందని పార్టీలకే అత్యధిక స్థానాలు దక్కుతుండటంతో వారే కీలక భూమిక పోషించనున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేవలం 44 స్థానాలు రాగా ఈసారి సొంతంగా బలం కొద్దోగొప్పో పెరుగుతుందే తప్ప ఆశించినంత మేర పెరగదన్నది అంచనా. బీజేపీ కూడా ఎన్డీఏ కూటమి తోనే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నల్టు తేలింది. ఈ సర్వేలో తేలిందేమిటంటే ఎన్టీఏకు 36 శాతం, యూపీఏకు 31 శాతం ఓట్లు పోలవుతాయి. అంటే రెండింటి మధ్య వ్యత్యాసం కేవలం ఐదు శాతం మాత్రమే. మొత్తం మీద ఈ సారి ఎన్నికల్లో గెలుపు ఇటు యూపీఏకు, అటు ఎన్డీఏకు అంత ఈజీకాదన్నది తేలుతోంది. మరి ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో పరిస్థితులు మారే అవకాశాలు కూడా లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com