సోషల్ మీడియా సాయంతో రైతులకు సూచనలు

అదిలాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి పంటను సాగుచేస్తుండగా గత రెండేళ్లుగా పంటలో పింక్‌బౌల్ ప్రభావం కారణంగా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండేళ్ల కిందట జిల్లాలోని ఆదిలాబాద్, ఇచ్చోడ ప్రాంతాల్లో పత్తి పంటలో పింక్‌బౌల్ వ్యాపించింది. ఫలితంగా రైతుల కొంత మేర నష్టపోవాల్సి వచ్చింది. పింక్‌బౌల్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులు ఓ వీడియోను రూపొందించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తారు. పత్తి పంటపై గులాబీ పురుగును పూత దశలో నివారించేందుకు వేపనూనే అవసరమవుతుండగా పలు దుకాణాల్లో దీనిని అధికారులు రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పత్తి పంటపై పూతపై లార్వా, ప్యూప దశల్లోని పింక్‌బౌల్‌ను అధికారులు నిర్మూలించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు చాల గ్రామాల్లో రైతులు తమ పంటలో లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకున్నారుగతేడాది వానాకాలం సీజన్ ఆగస్టు మొదటివారంలో జిల్లాలోని ఇచ్చోడ, జైనథ్, బేల, తలమడుగు, తాంసి, భీంపూర్, మావల మండలాల్లో పత్తికి గులాబీ పురుగు సోకిన ప్రమాదాన్ని గుర్తించిన రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించారు. దీంతో రంగంలో దిగిన అధికారులు రైతులకు సలహాలు, సూచనలు ఇస్తూ పురుగు ప్రభావం లేకుండా చర్యలు చేపట్టారు. ప్రమాదం తప్పిందకున్న రైతులకు పంట దిగుబడులు ప్రారంభమైన 20 రోజుల తర్వాత అక్టోబర్ చివరి వారంలో మరోసారి పత్తి పంటపై గులాబీ రంగు పురుగు ఆశించింది. బేల, జైనథ్, తాంసి, తలమడగు, భీంపూర్, ఆదిలాబాద్, మావల మండలాల్లోని పత్తి పంటపై ఈ పురుగు ఎక్కువ ప్రభావాన్ని చూపింది. ఫలితంగా రైతులు పంటను నష్టపోవాల్సి వచ్చింది. పత్తి పంట కాలవ్యవధి ఆరు నెలలు కాగా జూన్‌లో వేసిన పంటను డిసెంబర్‌లో తీసివేయాల్సి ఉంటుంది. నీటి సౌకర్యం ఉన్న రైతులు రెండు నుంచి మూడు నెలలపాటు పంటను పొడగిస్తున్నారు. దీంతో ఈ పురుగు ప్రభావం ఏటా పునారావృతమవుతుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో పత్తి పంట మంచి ఎదుగుదల దశలో ఉంది. సీజన్ ప్రారంభంలో వేసిన పంటకు పూత దశకు చేరుకుంది. ఈ దశలో పంటకు పింక్‌బౌల్ వచ్చే ప్రమాదం ఉండడంతో అధికారులు రైతులు మందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పత్తి రైతులకు 50 వేల లింగాకర్షక బుట్టలు కొనుగోలు చేశారు. 50 శాతం సబ్సిడీపై ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి క్లస్టర్‌కు 500 చొప్పున రైతులకు పంపిణీ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com