కరుణా చేతుల మీదే అవార్డు అందుకున్నా

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతికి ప్రముఖ సినీ నటుడు ఎం.మోహన్‌బాబు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రాజకీయ భీష్మ పితామహుణ్ని కోల్పోయామని అన్నారు. తన గురువు దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీడ’, ‘బంగారక్క’ చిత్రాలకు స్వర్గీయ కరుణానిధి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు. కరుణానిధి ఉత్తమ రాజకీయ నాయకుడు మాత్రమే కాదని అద్భుతమైన రచయిత, వక్త అని చెప్పారు. ఆయన మాటలు ఉద్వేగపరుస్తాయని అన్నారు. కళైంగర్ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. కరుణానిధి మరణం చాలా బాధించిందన్నారు. కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ఆ శిరిడి సాయినాథుని ఆశీస్సులతో మనోధైర్యం సిద్ధించాలని కోరుకుంటున్నానని మోహన్‌బాబు వెల్లడించారు. నిజానికి కరుణానిధి మరణ వార్త విన్న వెంటనే మోహన్‌బాబు ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు. ‘అసలైన దిగ్గజం, బడుగు బలహీన వర్గాల నాయకుడు కరుణానిధి ఎవరికీ అందనంత దూరంగా వెళ్లిపోయారు. సోదరులు స్టాలిన్, ఆళగిరి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కరుణానిధి తన విధానాలతో లక్షలాది మంది హృదయాలను హత్తుకున్నారు. లక్షలాది మందిలో ఆశల్ని నింపారు. తన రచనలతో లక్షలాది మందిలో స్ఫూర్తిని నింపారు’ అని మోహన్‌బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com