రజనీ 2.0 ట్రైలర్

0

యావత్ సినీ ప్రేక్షకులు, రజనీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న 2.ఓ అఫీషియల్ ట్రైలర్ మరికొన్ని నిమిషాల్లో విడుదల కానుంది. సుమారు రూ. 543 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కిన రజినీకాంత్, శంకర్ కాంబో మూవీ ట్రైలర్‌ను దీపావళి కానుకగా.. ఈ రోజు (నవంబర్ 3) మ‌ధ్యాహ్నం 12 గం.ల‌కి గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. చెన్నైలోని స‌త్యం సినిమాస్‌లో గ్రాండ్ ఈవెంట్‌ని నిర్వ‌హించి 4డీ సౌండ్‌ టెక్నాలజీతో ఈ ట్రైలర్‌ను భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

భారత సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 4డీ సౌండ్‌ టెక్నాలజీ వాడటం ఇదే తొలిసారి. ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share.

About Author

Leave A Reply