భారీ యక్షన్‌ స్ట్తెయిలిస్‌ ఫిల్మ్‌ ‘రాణా అక్రమ్‌’ 60 శాతం పూర్తి

అక్రమ్‌ సురేష్‌ హీరోగా మరియు దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని రాజధాని అమరావతి మూవీస్‌ సంస్థ నిర్మిస్తుంది. ఈ ఏడాది జనవరి నెలలో ప్రారంభమైన ఈ సినిమా అరవై శాతం టాకీపార్టుతో పాటు మూడు పాట చిత్రీకరణ కూడా పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎమ్‌. శివకుమారి మాట్లాడుతూ ‘‘ఇంత వరకూ గోవా, విజయవాడ, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలో షూటింగ్‌ చేశాం. ఇద్దరు అన్నదమ్ముల కథతో వినూత్నంగా రూపొందుతున్న భారీ యక్షన్‌ స్ట్తెలిస్‌ ఫిల్మ్‌ ఇది. ఈ కథకి తగ్గట్టుగా ఈ చిత్రానికి ‘రాణా అక్రమ్‌’ అనే పేరును ఖరారు చేశాం’’ అన్నారు. చిత్ర కథానాయకుడు మరియు దర్శకత్వం వహిస్తున్న అక్రమ్‌ సురేష్‌ మాట్లాడుతూ ‘‘అన్ని వర్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ కథను నేను తయారు చేసుకుని ప్రేక్షకు క్లాప్స్‌ కొట్టే డైలాగ్స్‌ రాసుకుని అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో రెడీ చేసుకుని నేనే హీరోగా నటిస్తూ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాను. దమ్మున్న కథతో సినిమా తీస్తే సక్సస్‌ గ్యారెంటీగా వస్తుందని ప్రేక్షక దేవుళ్ళు ఎన్నో సార్లు నిరూపించారు అది ఈ సినిమా విషయంలో మరో సారి రుజువు అవుతుంది. గత పది రోజు నుంచి రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీగా వేసిన సెట్‌లో టాకీపార్టుతో పాటుగా యాక్షన్‌ సన్నివేశాను చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 6వతేదీ సోమవారంతో ఈ షెడ్యూల్‌ పూర్తవుతుంది. నాుగు రోజు గ్యాప్‌ తీసుకుని మళ్ళీ ఈ నెల 10వ తేదీ నుంచి ఇదే రామోజీ ఫిల్మ్‌ సిటీలో మరికొన్ని సన్నివేశాతో పాటు యాక్షన్‌ దృశ్యాను కూడా చిత్రీకరిస్తాం. ఈ షెడ్యూల్‌లో సుమన్‌ గారు ఎంటర్‌ అవుతారు. గత షెడ్యూల్స్‌లో చేసిన టాకీపార్టు సన్నివేశాతో పోసాని కృష్ణమురళిపై చిత్రీకరించిన సీన్స్‌ చాలా బాగా వచ్చాయి. చివరి షెడ్యూల్‌ ముంబైలో జరుగుతుంది.
కథను నమ్ముకుని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న స్టెయిలిష్‌ యాక్షన్‌ చిత్రమిది. టి. అనిల్‌ కుమార్‌ ఫోటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే కో`డైరెక్టర్స్‌ రఘవర్ధన్‌రెడ్డి, హరి మరియు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రవి సహకారం ఈ సినిమా బాగా రావడానికి ఉపయోగపడుతోంది. సినిమాలో అన్ని పాటలకు ఎమ్‌.వి.సాయి అద్భుతమైన సంగీతాన్ని అందించారు’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఎమ్‌.వి.ఆర్‌ మరియు విస్సాకోటి మార్కండేయులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com