హెల్పింగ్ హేండ్ సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించిన రాము సూర్యారావు

కుల,మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఆపదలో,కష్టాలలో వున్న అభాగ్యులను ఆదుకునేందుకే మానవత సంస్థ ఆవిర్భవించిందని ఎంఎల్‌సి, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రీ అభివృద్ది కమిటీ చైర్మన్ రాము సూర్యారావు చెప్పారు. స్థానిక జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద బుధవారం ఆర్ ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్పింగ్ హేండ్ సంస్థ కార్యాలయాన్ని రాము సూర్యారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవత సంస్థ పేదలకు ఆదుకునేందుకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తోందని, బక్రీద్ పర్యదినం సందర్భంగా పేదలకు మరిన్ని సేవలు అందించేందుకు హెల్పింగ్ హేండ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పారు. మన ఇళ్లలో మన ఉపయోగించని , అవసరంలేని దుస్తులు, దుప్పట్లు, స్టీలు సామానులు, వంటపాత్రలు, ఆటవస్తువులు మొదలైనవి సేకరించి వాటిని నిరుపేదలు, వృద్దులు, నిరాశ్రయులు, అనాధపిల్లలకు అందించడం జరుగుతుందని చెప్పారు. మన ఇళ్లలో నిరుపయోగంగా పడివుండే వస్తువులను నిరుపేదలకు అందించగలిగితే వారికి తోడ్పాటుగా వుంటుందని, మనం చేసే ఈ చిన్న సహాయం వారికి ఎంతో బరోసాను ఇస్తుందని రాము సూర్యారావు చెప్పారు. వస్తువులు అందచేసేవారు స్వయంగా కార్యాలయానికి వచ్చి అందించవచ్చునని, వచ్చి అందించే అవకాశంలేని వారు సంస్థ కార్యాలయ ఫోన్ నెం .9493006791, 9866279988, 9912557433, 9394455133 లేదా 8919102822 నకు ఫోన్ చేస్తే వాలంటీర్లు మీ ఇంటివద్దకే వచ్చి వస్తువులు సేకరిస్తారని ఆయన చెప్పారు. ప్రతిఒక్కరూ హెల్పింగ్ హేండ్ కార్యక్రమం ద్వారా ఈ సేవా యజ్జంలో పాల్గొని పేదల జీవితాల్లో సంతోషపు వెలుగులు నింపడానికి సహకరించాలని రాము సూర్యారావు కోరారు. ఈ కార్యక్రమంలో మానవత అధ్యక్షులు నిర్మల, జిల్లా విద్యానిధి కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు, కడియాల కృష్ణారావు, జిజ్జువరపు ప్రసాద్, నేతల అజయ్ బాబు, కాంట్రాక్టర్ వి . వెంకటేశ్వరరావు, డా .రావి గోపాలకృష్ణారావు, పాండు, మానవత సభ్యులు పి .రత్నాకరరావు, సింహాచలం, పద్మజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com