మహేష్‌ మల్టీప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి రజనీ

0

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హైదరాబాద్‌లో నిర్మిస్తున్న మల్టీప్లెక్స్‌ ‘ఏయంబీ సినిమాస్‌’ తమిళ్ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమా 2.Oతో ప్రారంభం కానుంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించిన థియేటర్స్ కావటంతో.. 3డీ విజువల్‌, 4డీ ఆడియోతో రూపొదించిన 2.O లాంటి సినిమాతో ప్రారంభిస్తే బాగుంటుందని మహేష్ భావిస్తున్నారట. ఈ మల్టీప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి రజనీకాంత్‌ హాజరవుతారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ వార్తలపై మహేష్ స్పందిస్తే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు. మహేష్‌ బాబు, ఏసియన్‌ ఫిలింస్‌ సంస్థ సంయుక్తంగా ‘ఏయంబీ సినిమాస్‌’ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తోంది. ఈ థియేటర్స్‌ను ముందుగా ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ సినిమాతోనే ప్రారంభించాలని ప్లాన్‌ చేశారు. సినిమా రిలీజ్ సమయానికి నిర్మాణ పనులు పూర్తి కాకపోవటంతో మల్టీప్లెక్స్‌ ప్రారంభం వాయిదా పడింది. ఈ మల్టీప్లెక్స్‌లో మొత్తం 7 స్క్రీన్ లు ఉన్నాయి. మొత్తం 1638 సీట్లు ఉన్నాయి.

Share.

About Author

Leave A Reply