ఆయన బలమైన నేతే కదా

0

దేశంలో బీజేపీ వ్యతిరేక కూటములపై తమిళ్ సూపర్ స్టార్ రజిని కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయడం ప్రజాస్వామ్యానికేకాక, దేశానికి కూడా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. బీజేపీకి అనుకూలంగా చేసిన ఈ వ్యాఖ్యలతో రజినీకాంత్ మోడీకి మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే తమిళ రాజకీయాల్లో రజిని గనక పార్టీ పెడితే బీజేపీతో జతకట్టే అవకాశం ఉందని అక్కడ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తలైవా చేసిన ఈ కీలక వ్యాఖ్యలు ఆజ్యం పోసినట్లుగా కనిపిస్తున్నాయి. ఒక వైపు రజిని కాంత్ సినిమాలు తీస్తూనే, మరోవైపు రాజకీయ సంబంధిత విషయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే రజిని రాబోయే ఎన్నికల్లో పార్టీ పెట్టడమో లేదా బీజేపీ తరపున ప్రచారం చేయడమో జరుగుతుందని తమిళ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Share.

About Author

Leave A Reply