రాహుల్ హైదరాబాద్ పర్యటన ఖరారు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 13న మధ్యాహ్నాం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి 5000 బైక్‌లతో కార్యకర్తలు ర్యాలీగా స్వాగతం పలుకుతారు. అనంతరం రాజేంద్రనగర్‌లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని స్వయం సహాయక గ్రూపు సభ్యులతో మాట్లాడతారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు శేరిలింగంపల్లి జరిగే బహిరంగ సభలో ప్రసగిస్తారు. 8 నుంచి 9.30 గంటల వరకు నాంపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 10 నుంచి 11 గంటల వరకు ముస్లిం మేధావులతో సమావేశం ఉంటుంది. మరుసటి రోజు ఉదయం తొమ్మిదిన్నరకు పెద్దమ్మ గుడిని దర్శించుకుంటారు. 10 నుంచి 11 గంటల మధ్య జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నాయకులతో సమావేశం ఉంటుంది. 11 నుంచి 12 గంటల మధ్య వ్యాపారవేత్తలతో సమావేశం అవుతారు. 12 నుంచి 12.30 గంటల మధ్య ప్రెస్‌క్లబ్‌లో ఎడిటర్లతో సమావేశంవుంటుంది. మధ్యాహ్నాం 1 నుంచి 1.30 వరకు ప్యారడైజ్ రెస్టారెంట్లో భోజనం చేస్తారు. 2 నుంచి 3 గంటల మధ్య ఉస్మానియా యూనివర్సిటీని సందర్శిస్తారు. 3.30 నుంచి 4.30 గంటల మధ్య సికింద్రాబాద్‌లో పబ్లిక్ మీటింగ్‌లోని పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య సనత్‌నగర్‌లో సమావేశం లో పాల్గోంటారు. 6 నుంచి 7.30 గంటల మధ్యలో గోషామహల్లో సమావేశానికి హజరవుతారు. 8 నుంచి 9 గంటల మధ్యలో కులీకుతుబ్ షా స్టేడియంలో మీటింగ్ వుంటుంది. 9 నుంచి 9.30 వరకు పాతబస్తీలోని మదీనా హోటల్లో రాత్రి భోజనంచేస్తారు. రాత్రి 10.30 గంటలకు తిరిగి ఢిల్లీ తిరిగివెళతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com