అనిల్ చేతికి ఆర్ కామ్ సంస్థ

ఆర్‌కామ్ సంస్థకు చెందిన దాదాపు రూ.2000 కోట్ల ఆస్తులు రిలయెన్స్ జియో చేతికి అందాయి. ఈమేరకు రిలయన్స్‌ జియోకు మీడియా కన్వెర్జెన్స్‌ నోడ్స్‌(ఎంసీఎన్‌)ను అమ్మేసినట్లు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ వెల్లడించింది. అనిల్‌ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌ సంస్థ 248 నోడ్‌‌లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఆస్తులు కలిపి దాదాపు మొత్తం రూ.2000 కోట్ల విలువైన ఆస్తులను ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియోకు అమ్మే ప్రక్రియ పూర్తయినట్లు తెలిపింది. 5 మిలియన్ల చదరపు అడుగుల ప్రాంతాన్ని టెలికాం మౌలిక వసతుల కోసం ఉపయోగించనున్నారు. అన్నీ జియోకు బదిలీ చేసినట్లు ఆర్‌కామ్‌ గురువారం (ఆగస్టు 23) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డీల్‌తో మార్కెట్లో ఆర్‌కామ్ షేర్ విలువ 1.97 శాతం మేర పెరిగి రూ.19.15 వద్ద కొనసాగుతోంది. 46,000 కోట్ల రుణభారాన్ని తగ్గించుకోవడానికి ఆర్‌కామ్ ఆస్తులను.. ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని జియోకు అమ్మే ప్రక్రియ ఈ డీల్‌తోనే ప్రారంభమైనట్లయ్యింది. తన వైర్‌లెస్ ఆస్తులను జియోకు, రియల్ ఎస్టేట్ ఆస్తులను కెనడానకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌కు అమ్మడం ద్వారా దాదాపు 18,000 కోట్లు సమకూరుతాయని ఆర్‌కామ్ అంచనావేస్తోంది. ఇలా వచ్చిన మొత్తాన్ని 39 మంది రుణదాతలకు బకాయిపడ్డ రుణాలను చెల్లించాలని భావిస్తోంది. దీంతోపాటు ఆర్‌కామ్‌కు చెందిన 65 మెగాహెట్జ్ స్పెక్ట్రాన్ని రూ.3,500 – రూ.3,700 ధరకు జియోకు అమ్మే ఆలోచనలో సంస్థ ఉంది. ఇంకా రూ.25వేల కోట్ల విలువైన ఆస్తులను ఆర్‌కామ్‌ అమ్మనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌.. రిలయన్స్‌ జియోతో ఒప్పందం కుదర్చుకుంది. అప్పులు తగ్గించుకునేందుకు ఆర్‌కామ్‌ వైర్‌లెస్‌ స్పెక్ట్రమ్‌, టవర్‌, ఫైబర్‌ అండ్‌ ఎంసీఎన్‌ ఆస్తులను జియోకు అమ్మేసేందుకు అంగీకరించింది. 2017 డిసెంబరులోనే ఈ డీల్‌ ప్రకటించారు. 122.4 మెగా హెడ్జ్‌ 4జీ స్పెక్ట్రమ్‌, 43000 టవర్లు, 1,78,000 కిలోమీటర్ల ఫైబర్‌, 248 మీడియా కన్వర్జెన్స్‌ నోడ్స్‌ అమ్మకం ఈ డీల్‌లో ఉంది. నేటితో నోడ్స్‌ అమ్మకం పూర్తయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com