ఖమ్మం ప్రైవేటు వైద్యానికి సుస్తి

0
 
hospital_apduniaఖమ్మం జిల్లాలో ప్రైవేటు వైద్య రంగానికి రోగమొచ్చింది… రోగి రోగమే కోరాడు వైద్యుడు రోగమే కోరాడు అన్నట్లుగా ప్రైవేటు వైద్యం పెడదారి పట్టింది.. కాసుల కక్కుర్తిలో వైద్యో నారాయణ హరి అన్న మంచి సూక్తి తీరు మారి పోయింది… కమీషన్ల మాటున రోగుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అవసరం లేకున్నా తప్పుడు రిపోర్టులతో రోగుల ఇళ్ళ ఒళ్ళు గుల్ల చేస్తున్నారు..భారత వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త తనీఖీల్లో నమ్మ లేని నిజాలు బయట పడుతున్నయి. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నంతలో కఠిన నిర్ణయాలు  అమలు చేస్తున్నాఅడ్డు కట్ట వేయ లేని పరిస్థితి నెల కొంది.. ఖమ్మం నగరంలో ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటిలో నిభందనలు పాటించేవి ఒక్క శాతం మాత్రం ఉండటం గమనార్హం.. కనీససదుపాయాలు సిబ్బంది పరికారాలు లేకేండానే కార్పోరేట్ వైద్య మంటూ రోగులను దోచుకుంటున్నాయి…
 
అనారోగ్యానికి గురై ఆసుపత్రికి వెళ్ళిన రోగి కంటే కమీషన్ కొసం కక్కుర్తి పడి దోచుకునే మెడికల్ ప్రాక్టీషనర్లకే కొన్న ఆసుపత్రుల యాజమాన్యాలు రెడ్ కార్పెట్ వేస్తాయన్న ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి.. రోగి పరిస్థితిని ముందుగానే ఆర్ఎంపిల ద్వారా రాబట్టి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ గా చేరాల్సిన అవసరం లేకున్నా ఆర్ఎంపిల ద్వారా రోగులను భయానికి గురు చేసి వైద్యం చేస్తు రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఆసుపత్రిలో చేరిందే మొదలు వ్యాది నిర్దారణ పరీక్షలు.మందులు గద అద్దెలు బారం పడేలా రోగి కుటుంబం చితికేలా వసూలు చేస్తున్నారు..రోగి నుండి వసూలు చేసిన సొమ్ములో 40 శాతం నుండి 60 శాతం ఆర్ఎంపిలకు కమీషన్లు ఇస్తున్నారంటే దోపిడి ఎంతలా పేరుకుపోయిందో అర్దం అవుతుంది..వ్యాది నిర్దారణ పరీక్షలకు 1 వెయ్యినుండి 2 వేలకు ఎలా వసూలు చేసిన వైనంపై సాక్ష్యలతో సహ జిల్లా కలెక్టర్ కు జిల్లా వైద్యాదికారి. ఐఎమ్ఏ పిర్యాదు చేశారంటేనే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.
 
ఖమ్మం నగరంలో పలు ఆసుపత్రుల జరుగుతున్న అక్రమాలపై వరుస పిర్యాదులు వచ్చిన నేపద్యంలో గత ఆరు నెలల్లో వైద్య ఆరోగ్య శాఖ పలు మార్లు ప్రైవేటు ఆసుపత్రుల్లో తనికీలు నిర్వమించింది..ఈ సమయంలో విస్తు గొలిపో నిజాలు వైద్యాదికారుల దృష్టికి వచ్చాయి. రెండు దపాలుగా 11 ఆసుపత్రల్లో తనఖీలు నిర్వహించగా లోపాలపై నోటీసులు జారి చేసి చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాదికారి కొండల్ రావు ప్రకటించారు.. నోటీసులు జారి చేసి నోరు మొదపక పోవడంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖపై ఆరోపణల వెల్లువ సాగుతుంది..తనీకీలు చేసి ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణలో లోపాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న దానిపై ప్రదానంగా ఆరోపనలు వెళ్లవెత్తున్నాయి. బోనులో ముద్దాయిగా ఆరోగ్యశాఖ అదికారుల ఉండటంపై పలుఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో సమాదానం చెప్పాల్సిన పరిస్థితి రావడం మన ఆరోగ్య శాఖ శాఖ పని తీరుకు అద్దం పడుతుంది.
 
నగరంలో లీజుకు తీసుకుని నడుపుతున్న ఓ ఆసుపత్రి అగ్నీమాపక. శస్త్ర్ర చికిత్సల అనుమతే తీసుకోలేదు.. ఓసాదరణ ఆసుపత్రి బోర్డుపై జనరల్ మెడిసిన్ అని పేరుంది. వైద్యం చేసేది మాత్రం మరో వ్యక్తి.. కొన్ని ఆసుపత్రుల్లో హైదరాబాద్ స్పేషలిస్టు వైద్యాల పేర్లు ఉంటాయి. ఆసుపత్రిలో కాంపౌండర్. ఓనర్సు ఉంటుంది.. మిగతా వ్యవహారం మొత్తం ఆర్ఎంపిల కనసన్నల్లో నడుస్తుంది.. ఇలాంటి ఆసుపత్రుల్లో రోగులు వస్తే మలేరియా డింగీ అంటూ రోగులను హడలెత్తించి జలగల్లా పీల్చుకు తింటారు..కొద్ది రోజుల క్రితం మధిర ప్రాంతంలో ఆర్ఎంపిల సలహలతో డెంగీ పేరుతో వైద్యం చేసి 10 మృతికి కారణం అయ్యారు.. అత్యదిక మోతాదులో మందులు ఇవ్వడంతో సలువురు మృత్యు వాత పడ్డారు.. ప్రభుత్వం కళ్ళు తెరిచి దర్యాప్తుకు ఆదేశించడంతో విషయం వెలుగులోకి వచ్చింది కాని అమాయకుల ప్రాణాలు తిరిగి రాలేదు… ఆసుపత్రుల్లో సరైన వైద్యులు.సిబ్బంది.వసతులు లేకున్నా చర్యలు తీసుకోక పోడంపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది..రాష్ట్ర్ర ప్రభుత్వం అన్ని శాఖలను చక్క దిద్ది వైద్య ఆరోగ్యశాఖను గాలి కొది లేయడంపై అసహనం అనుమానం. ఆగ్రహం వ్యక్తం అవుతుంది.
….
Share.

Comments are closed.