ప్రగతి నివేధన బయటపెట్టాలి

రాహుల్ పర్యటన ప్రాధాన్యత తగ్గించేందుకు, మీడియా కవరేజ్ తగ్గించేందుకు కేసీఆర్ పార్టీ కార్యవర్గ సమావేశం పెట్టారు. అయినా రాహుల్ పర్యటన విజయవంతం అయ్యింది. సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ పెడతానని కేసీఆర్ చెప్పారు. కానీ అది సాధ్యం కాదని నిఘావర్గాలు నివేదిక ఇచ్చారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు పూర్తి వ్యతిరేకత తో ఉన్నారని సీఎం కు అందిన నివేదికలో ఉంది. కేసీఆర్ కు చేతనైతే చెప్పిన విధంగా ప్రగతి నివేదన సభ పెట్టాలి. ఆగస్టు 15 కల్లా ఇంటింటి నల్లా నీళ్లు ఇస్తామని కేసీఆర్ చెప్పాడు. లేకుంటే ఓట్లు అడగనని కేసీఆర్ చెప్పాడు. కానీ ఇంతవరకు ఆ హామీ ఏమైందని అయన అన్నారు. ఈ డిసెంబర్ వరకు కూడా కెసిఆర్ ఆ హామీని నెరవేర్చలేదు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలే .. ప్రతి నియోజకవర్గానికి వంద పడకల హాస్పిటల్ అన్నాడు పెట్టలేదని రేవంత్ అన్నారు. ఇవే కాదు చేస్తానన్న ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేక పోయాడు. ప్రగతి నివేదన సభ పెడితే ఇచ్చిన హామీలపై నేను బహిరంగ చర్చకు నేను సిద్ధమ ని అన్నారు. సమస్యలనుంచి దృష్టి మరల్చేందుకే .. పార్టీలో తిరుగుబాటు నుంచి బయటపడేందుకు .. ముందస్తు ఎన్నికలనే నాటకం. ఓటర్ లిస్ట్ వచ్చే జనవరి కల్లా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారి లేఖ రాశారు. ఓటర్ లిస్ట్ పూర్తి కాకుండా ఎలా ముందస్తు ఎన్నికలను నిర్వహిస్తారని అయన ప్రశ్నించారు. కాంగ్రెస్ శ్రేణులు ముందస్తు ప్రిపరేషన్స్ పక్కన పెట్టి సర్కార్ వైఫల్యాలను జనం లోకి తీసుకెళ్లాలి. అసెంబ్లీ లో ఎంఐఎం తో కలిసి వెళ్లాలని .. దాని తరువాత ఎంఐఎం కు పక్కన పెట్టి బీజేపీ తో కలిసి లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ చూస్తున్నాడు. ఎంఐఎం కూడా దీనిపై ఆలోచించాలి. జమిలీ ఎన్నికలంటున్న మోడీ .. అసెంబ్లీ కి ముందస్తు ఎన్నికలకు ఎలా సహరిస్తారు. అసెంబ్లీ .. లోక్ సభ ఎన్నికలు వేరు వేరుగా పెట్టడం వల్ల ఆర్థిక భారమని అయన అన్నారు. కేసీఆర్ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలను మోడీ సహకరిస్తే .. అది లోపాయకారి ఒప్పందమే. పార్టీ క్యాడర్ ను అప్రమత్తం చేసేందుకు మాత్రమే పీసీసీ చీఫ్ ముందస్తు ఎన్నికలంటున్నాడు. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకే పీసీసి అధ్యక్షుగా ఉత్తమ్ పార్టీ ని సమాయత్తం చేస్తున్నాడని అయన ఆరోపించారు. బీజేపీ తో కలిసేవాళ్లను .. లోపాయకారి ఒప్పందాలు పెట్టుకునే వాళ్ళు మాకు శత్రువులేనని చంద్రబాబు ఆ పార్టీ నేతలకు చెప్పాడు. చంద్రబాబు మాటల ప్రకారం తెలంగాణలో టిఆర్ఎస్ వారికి శత్రువుని తేలిపోయింది. ఇక మిత్రులెవరన్నది తేలడానికి ఇంకా సమయం పడుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com