తెలంగాణా తొలిదశ ,మలిదశ ఉద్యమం లో జయశంకర్ పాత్ర కీలకమైనది

తెలంగాణా తొలిదశ ,మలిదశ ఉద్యమం లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాత్ర కీలకమైనదని పలువురు నేతలు కొనియాడారు. ఆచర్య జయశంకర్ జన్మదిన వేడుకలు సచివాలయం లో ఘనంగా నిర్వహించారు.తెలంగాణా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ ఆద్వర్యం లో జరిగిన ఈ వేడుకల్లో టిఎన్జిఓ సెంట్రల్ యునియన్ అద్యక్షులు కారం రవీందర్ రెడ్డి,కార్యదర్శి రాజేందర్, తెలంగాణా ఉద్యోగుల సంఘం అద్యక్షులు ఏ.పద్మా చారి, ,సచివాలయ ఉద్యోగుల సంఘం అద్యక్షులు గిరి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొని ప్రసంగించారు.తెలంగాణా ఉద్యమానికి జయశంకర్ మార్గదర్శకులు గా నిలువడమే కాకుండా తెలంగాణా వాదాన్ని, బావజాలాన్ని ప్రజల్లో నిరంతరం ప్రబావితం చేస్తూ వచ్చారని అన్నారు.తెలంగాణా సాదనలో ముఖ్య మంత్రి కిసిఅర్ కు మార్గదర్శకులుగా ఉంటూ తెలంగాణా కళను సాకారం అయ్యేవిదంగా బాటలు వేసారని కొనియాడారు.ముక్యంగా ఉద్యోగుల ఉద్యమం లో జయశంకర్ సర్ ముందుగా నిలిచారన్నారు.ఏ స్పూర్తి తోనైతే జయశంకర్ సార్ తెలంగాన ఏర్పాటుకు దోహదపడ్డారో అదే స్పూర్తి తో ఉద్యోగులు బంగారు తెలంగాణా ను సాదించి నప్పుడే ఆయనకు నిజమైన నివాళిని అర్పించిన వారమవుతామన్నారు.ఈ సందర్బంగా ముఖ్య మంత్రి తెలంగాణా ఉద్యోగుల సమస్యలు ప్రరిస్కరిస్తారన్న ఆశాభావాన్ని నేతలు వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com