ఇవాళ హైద్రాబాద్ లో రాష్ట్రపతి పర్యటన

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదారాబాద్ పర్యటనకు రానున్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా బేగంపేట్, రాజ్‌భవన్, రాష్ట్రపతి నిలయం మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. రాష్ట్రపతి ప్రయాణించే మార్గాల్లో వాహనాలను నిలిపివేయడం లేదా వేరే మార్గం ద్వారా పంపడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఆదివారం ఉదయం 9.45 నుంచి 10.45 గంటల వరకు రాజ్‌భవన్ నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం వరకు వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లి రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆదివారం (ఆగస్టు 5) ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు చేరుకొని ‘హరితహారం’ కార్యక్రమంలో భాగంగా అక్కడ మొక్కలు నాటుతారు. అనంతరం హకీంపేట ఎయిర్‌పోర్టు నుంచి సంగారెడ్డి కందిలోని హైదరాబాద్‌ ఐఐటీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు రాష్ట్రవతి తిరువంతపురం బయలుదేరి వెళ్తారు. బేగంపేట్ విమానాశ్రయం, వీవీ విగ్రహం, రాజ్‌భవన్,ఎంఎంటీఎస్, విల్లా మేరీ, యశోద ఆస్పత్రి, రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్, సీఎం క్యాంపు ఆఫీస్, గ్రీన్‌ల్యాండ్స్ ఫ్లై ఓవర్, బేగంపేట్ ఫ్లై ఓవర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, షాపర్ స్టాప్ , పీఎన్టీ ఫ్లైఓవర్, రసూల్‌పూరా జంక్షన్, సీటీవో ఫ్లైఓవర్, సీటీవో జంక్షన్, ప్లాజా ఎక్స్ రోడ్స్, టివొలీ ఎక్స్ రోడ్స్, ఎన్సీసీ, డైరెక్టరేట్ ఎక్స్ రోడ్స్, సికింద్రాబాద్ క్లబ్ ఇన్ గేట్- అక్సిజన్ ఆస్పత్రి, విక్రమ్‌పురి, కార్ఖానా పోలీస్ స్టేషన్, హనుమాన్ టెంపుల్, ఆర్టీఏ ఆఫీస్,తిరుమలగిరి ఎక్స్ రోడ్స్, ఎంజీ కమ్యూనిటీ హాల్, హోలీ ఫ్యామిలీ జంక్షన్, లాల్‌బజార్, లోతుకుంట వై జంక్షన్ కుడి మలుపు, మల్లారెడ్డినగర్, రాష్ట్రపతి నిలయం మార్గంలో రాష్ట్రపతి ప్రయాణం కొనసాగుతుంది. ఈ సందర్భంగా వాహనాలను నిలిపివేయడం, మళ్లింపులు చేపట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *