RRRకి ముఖ్య అతిథిగా రానున్న ప్రభాస్

0

రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ మల్టీ స్టారర్ రూపొందనుంది. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటించనున్న ఈ సినిమా కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభాస్ రానున్నాడనేది తాజా సమాచారం. ‘బాహుబలి’ .. ‘బాహుబలి 2’ కోసం రాజమౌళి .. ప్రభాస్ సంవత్సరాల పాటు కలిసి పనిచేశారు. ఈ రెండు సినిమాలు ప్రభాస్ క్రేజ్ ను శిఖరం స్థాయికి తీసుకెళ్లాయి. తనకి ప్రపంచవ్యాప్తంగా ఇంతటి గుర్తింపు తెచ్చిపెట్టిన రాజమౌళి అంటే ప్రభాస్ కి ఎంతో గౌరవం వుంది. అందువలన ఆయన ఆహ్వానించిన వెంటనే ప్రభాస్ ఒప్పేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో ఈ సినిమా రూపొందనుంది. 1920 నాటి నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు. కథానాయికలు ఎవరనేది త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

Share.

About Author

Leave A Reply