మోహన్ బాబుకు లక్కులేదట

0

posani krishna murali_apduniaమోహన్ బాబును చిన్నతనం నుంచి గమనిస్తున్నానని, ఆయనంత అందం, వాచకం లేని వారంతా అందలాలు ఎక్కినా ఆయన మాత్రమే ఇతరులంత విజయవంతం సాధించలేకపోయారని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. దీనికి కారణం ఆయనకు లక్కు లేకపోవడమేనని తెలిపారు. హైదరాబాదులో జరిగిన లక్కున్నోడు సినిమా ఆడియో వేడుకలో పోసాని మాట్లాడుతూ తాను రచయితగా ఉన్నప్పుడు మోహన్ బాబుకు సరైన కథ రాయలేకపోయానని గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ ఆయన కుమారుడు విష్ణు తనకు మంచి పాత్రలు ఇస్తున్నారని అన్నారు. విష్ణు అద్భుతమైన పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు.

Share.

Comments are closed.