ఆయన మోసగాడు – పోసాని ఫైర్..!

0

ఏపీ సీఎం చంద్రబాబు పై నటుడు పోసాని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. హైదరాబాద్ లో ఉంటున్న తెలుగు వారు బాబును అసలు నమ్మొద్దు, ఆయన మోసగాడు అన్నారు. ఆయన మాటలు నమ్మి ఓటేస్తే యాభై ఏళ్ళు వెనక్కి వెళ్తాము అన్నారు. చంద్రబాబు బతికి ఉన్నంతకాలం నిజం చెప్పరని, నిజం చెప్తే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందన్న శాపం ఉందని తెలిపారు. తాను టీఆర్ఎస్ కే ఓటేస్తానని తెలిపారు, తక్కువ కలంలోనే చాలా అభివృద్ధి పనులు చేసారని కెసిఆర్ ని పొగిడారు. దేశం లోని ఉత్తమ సీఎం లలో కెసిఆర్ ఒకరని అన్నారు, కెసిఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేసారు.

కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం పై టీడీపీకి సర్వత్రా వ్యతిరేకత ఏర్పడుతోంది. టీడీపీ ఆవిర్భవించిందే కాంగ్రెస్ వ్యతిరేక నినాదంతో అని, అలాటిది సిద్ధాంతాలను గాలికి వదిలి అధికారం లోకి రావటమే లక్ష్యంగా కాంగ్రెస్ తో కలవటం అనైతికం అని, ఇది అప్రజాస్వామికం అని పలువురు అభిప్రాయం పడుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం అంటున్నారు కాబట్టే కాంగ్రెస్ తో కలిసాం అంటూ ప్రజల్లో ఈ పోత్తుపై సానుకూలత తేవాలని బాబు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి, టీడీపీ కాంగ్రెస్ ల అప్రజాస్వామిక కలయిక పై ప్రజల స్పందన ఎలా ఉంటుందనేది ఎన్నికల వరకూ వేచి చూడాల్సిన అంశం.

Share.

About Author

Leave A Reply