పవన్‌తో పూజా హెగ్డే

0
pawan-kalyan-pooja-hegde-apdunia‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది పూజా హెగ్డే. అయితే ఆ రెండు చిత్రాలూ మంచి విజయం సాధించడంలో విఫలమవడంతో పూజా కొంత నిరాశపడింది. సౌత్ లో డీలా పడ్డా హృతిక్ రోషన్ ‘మొహంజదారో’తో తనకు భారీ హిట్ ఖాయమనుకుంది. కానీ అదీ ఫ్లాప్ లిస్టులో పడింది. సినిమాలు ఫట్టవుతున్నా ఏం మాయ చేసిందో ఏమో గానీ అమ్మడికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘దువ్వాడ జగన్నాథమ్‌’లో పూజానే కథానాయిక. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ సినిమాలోనూ ఛాన్స్‌ అందుకొందని తెలుస్తోంది. 
 
పవన్‌ కల్యాణ్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో కథానాయికగా పూజాని ఎంచుకొన్నారని అంటున్నారు. మరో కథానాయికగా కీర్తి సురేష్‌ని తీసుకొన్నారట. ‘‘బాలీవుడ్ కు వెళ్లినంత మాత్రాన నేను తెలుగు సినిమాలకేం దూరం కాలేదు. ‘మొహంజదారో’ కోసం కొన్ని సినిమాల్ని ఒప్పుకోలేదంతే. ఇప్పుడు మళ్లీ వరుసగా అవకాశాలు రావడం నా లక్. ఇక ముందూ తెలుగులోనే కొనసాగుతా’’ అంటోంది పూజా.
Share.

Comments are closed.