కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కేటీఆర్ చిప్పలు కడిగారని… తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడకు వచ్చి, కండకావరంతో మదమెక్కి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చరిత్రను బయటపెడితే కేటీఆర్ బయట తిరగలేడని అన్నారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని సూచించారు.చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు… మధ్యలో వచ్చిన లుచ్చాగాళ్లు ఎవరని పొన్నం ప్రశ్నించారు. మీ అయ్య కేసీఆర్ కు రాజకీయ జన్మను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. కరీంనగర్ జిల్లాను ముక్కలు చేసినవారే లుచ్చాగాళ్లు, లోఫర్లు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆత్మబలిదానాలతో తెలంగాణను తెచ్చుకున్నది… నాలుగేళ్లలో రూ. 2 లక్షల కోట్లు అప్పు చేయడానికి కాదని మండిపడ్డారు.టీఆర్ఎస్ చేయించిన 6 సర్వేల్లో ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని… అందుకే ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నారని పొన్నం ఎద్దేవా చేశారు. కేసీఆర్, హరీష్ రావులు రెచ్చగొట్టడం వల్లే తెలంగాణలో ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని చెప్పారు. రాహుల్ పర్యటనతో టీఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకుందని అన్నారు. టీఆర్ఎస్ నేతలు గ్రామాల్లోకి వస్తే, రాళ్లతో కొట్టే రోజులు వస్తున్నాయని చెప్పారు. కంటి పరీక్షలు తెలంగాణ ప్రజలకు కాకుండా, ముందు రాష్ట్ర మంత్రులు చేయించుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com