అమ్మా నన్ను క్షమించు

తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని గీతిక ఆత్మహత్య కలకలంరేపింది. ఆమె తన ఇంట్లోనే ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. మెడికో శిల్ప చనిపోయిన ఐదు రోజుల తర్వాత గీతిక ప్రాణాలు తీసుకోవడంతో.. ఈ ఆత్మహత్యపై కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే గీతిక ఇంట్లో పోలీసులు ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకోగా.. వ్యక్తిగత కారణాలతోనే ప్రాణాలు తీసుకుందనే అంచనాకు వచ్చారు. గీతిక సూసైడ్ నోట్‌లో ‘అమ్మా.. నా జీవితం ఇలా అయిపోతుందని ఊహించలేదు. ఎందుకో అమ్మా ఇక నాకు బతకాలని లేదు. నాకు ఈ పరిస్థితి వస్తుందని ఊహించుకోలేదమ్మ. అందరి గురించి ఆలోచించి.. అందరు అమ్మాయిల్లా నాకూ భర్త, కుటుంబం.. అతని ప్రేమ కావాలనుకున్నా. కానీ నా జీవితంలో నేను ఓడిపోయానమ్మా. తను లేకుండా నేను బతకలేను.. కనీసం నా జీవితం కోసమైనా తనను ఏమీ చేయకమ్మా. నన్ను క్షమించు అమ్మ. నేను పిరికిదాన్ని కాదమ్మా. కానీ నాకు వేరే దారి కనిపించలేదు. తను లేకుండా బతకలేను. అలా అని తనతో కలిసి బతకలేను. అందుకని వెళ్లిపోతున్నాను. నన్ను క్షమించండి’అంటూ గీతిక నోట్‌లో పేర్కొంది. గీతిక సూసైడ్ నోట్‌ను బట్టి పోలీసులు వ్యక్తిగత కారణాలతోనే గీతిక ఆత్మహత్య చేసుకున్నట్లు దాదాపు నిర్థారణకు వచ్చారట . ఈ నోట్ ఆధారంగా కేసు దర్యాప్తును కొనసాగిస్తూ.. గీతిక కుటుంబ సభ్యుల్ని కూడా ప్రశ్నిస్తున్నారు. నోట్‌లో అంశాలను కూడా వారితో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. గీతిక తిరుపతి స్విమ్స్‌లో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతోంది. శివజ్యోతినగర్‌లోని తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కడప జిల్లాకు చెందిన హరితాదేవి గీతికతో కలిసి తిరుపతిలో ఉంటున్నారు. న్యాయవాదిగా పనిచేసిన గీతిక తండ్రి విజయ్‌భాస్కర్‌ రెడ్డి ఐదేళ్ల క్రితం చనిపోడంతో తల్లి కూతురి బాగోగులు చూసుకుంటోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com