కే సముద్రంలో పైలేరియా

ఫైలేరియా తో ఆ గ్రామస్తులు నిత్యం మంచం పడుతున్నారు. రోజురోజుకు గ్రామంలోని బాధితుల సంఖ్య పెరిగిపోతుండడం, వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లవలసి రావడం, లక్షలు రూపాయలు ఖర్చు అవుతుండడం తమకు ఆ వ్యాధి వస్తుందోనని ఆ గ్రామస్తులు తీవ్ర భయాందోళలనలకు గురవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామంలో సుమారు 4000 వేల కు పైగా జనాభా ఉంది. గత సంవత్సరం నుండి గ్రామస్తులు మొదట చలిజ్వరంతో, ఆ తర్వాత ఎడమ కాలు వాపు, నలుపు రంగులోకి మారి మంచం పడుతున్నారు. వ్యాధి బారినపడిన వారు మొదట గ్రామంలోని ఆర్ఎంపీల ను సంప్రదించి చికిత్స పొందుతున్నారు. వ్యాది తగ్గక పోవడం తో మహబూబాబాద్, వరంగల్, హైదరాబాదు,లలోని హాస్పిటల్ లకు వెళ్తున్నారు. అక్కడ డాక్టర్లు ఇన్ఫెక్షన్ సోకిన ప్రదేశాలలో ఆపరేషన్ చేసి ఇన్ఫెక్షన్ను తీసి వేస్తున్నారు. సంవత్సర కాలం గడిచినా ఆపరేషన్ చేసిన ప్రదేశంలో పుండు మానకపోవడం, మళ్లీ ఫైలేరియా సోకడంతో ఆ వ్యాదిగ్రస్తులు మంచానికె పరిమితం అవుతున్నారు. గ్రామానికి చెందిన మల్లేశం సుతారి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సంవత్సరం క్రితం చలిజ్వరంతో కాలు వాపు వచ్చింది దీనితో అతను మహబూబాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు. అది నయమైన కొన్ని రోజులకే మళ్లీ కాలు వాపు మొదలైంది. ఇదే గ్రామానికి చెందిన నీలం శ్రీకాంత్ కు 9 నెలల క్రితం జ్వరంతో కాలు వాపు వచ్చింది. ఇతను మొదట మహబూబాబాద్, అనంతరం వరంగల్ ఎంజీఎం కు వెళ్ళాడు. ఇక్కడ తగ్గకపోవడంతో హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రి కి వెళ్ళాడు.అక్కడ డాక్టర్లు ఆపరేషన్ చేసారు. 9 నెలలు గడిచినా ఇతనికి ఆ వ్యాధి తగ్గక మంచానికే పరిమితమైనాడు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి మల్లయ్య కూడా ఇదే వ్యాధితో 8 నెలల నుండి బాధపడుతున్నాడు. మరో మహిళ మాచర్ల సత్యమ్మ కు 7 నెలల క్రితం తీవ్ర చలి జ్వరం, కాలు వాపు రావడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందింది. ఇప్పటికీ పూర్తిగా నయం కాక, నొప్పులతో ఇబ్బంది పడుతుంది. వారం రోజుల క్రితం గ్రామానికి చెందిన సోమయ్య అనే వృద్దునికి ఫైలేరియా సోకి మంచం పట్టాడు.ఈ విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఏమిటో డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్ వైద్య బృందంతో గ్రామాన్ని సందర్శించి రోగులను పరీక్షించారు.అంతుచిక్కని వ్యాధి కాదని, ఫైలేరియా అని, గ్రామం లో 56 మంది కి ఫైలేరియా సోకింది అని,8 మంది మంచం పట్టారు అని అన్నారు. వ్యాధి సోకిన వెంటనే యాంటీబయాటిక్స్ తోపాటు మరికొన్ని మందులు వాడితే వెంటనే తగ్గిపోతుందని అన్నారు. ఫైలేరియా వ్యాధి గ్రస్తులకు మహబూబాబాద్ లోని ప్రధాన వైద్యశాలలో 8 బెడ్స్ ను కేటాయిస్తున్నామని తెలిపారు. గ్రామస్తులు భయపడవలసిన అవసరం లేదని, ఇది అంటువ్యాధి కాదని అన్నారు. మురుగు నీరు నిల్వ ఉండకుండా, దోమలు లేకుండా చూసుకోవాలీ అన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com