అనంత‌పురాన్నే ద‌త్త‌త తీసుకుంటా : పవన్‌కల్యాణ్‌

0

pawan kalyan-apduniaరాయలసీమలోని కరవు ప్రాంతాలను పరిశీలించేందుకు పాదయాత్ర చేయాలని ఉందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తెలిపారు. అప్పుడే కరవు గురించి మాట్లాడతానన్నారు. అనంతపురం జిల్లా గుత్తిలో గేట్స్‌ కళాశాల విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఓ విద్యార్థి ఓ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుంటారా? అని అడిగారు. దానికి స‌మాధానంగా ప‌వ‌న్ క‌ల్యాణ్.. ‘ఒక్క గ్రామాన్ని కాదు, మొత్తం అనంత‌పురాన్నే ద‌త్త‌త తీసుకుంటాన‌ని అన్నారు. అంతటితో ఆగకుండా మొత్తం రాయ‌ల‌సీమను ద‌త్త‌త తీసుకుంటానని చెప్పారు. అనంతపురంలో కరవు పోవాలంటే అవినీతిని నిర్మూలించాలన్నారు. చిన్నతనం నుంచి తనకు చదువు కంటే దేశభక్తే ఎక్కువ వంటబట్టిందని పవన్‌ చెప్పారు.

అమరావతి అభివృద్ధికి ఎంతో డ‌బ్బు ఖ‌ర్చుపెడుతున్నారు. అనంత‌పురాన్ని ప‌ట్టించుకోక‌పోతే నేను ఊరుకోను. అమ‌రావ‌తి అద్భుతంగా అభివృద్ధి జ‌రిగి, అనంత‌పురం ప్ర‌జ‌లు ఏడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోన‌ని అన్నారు. తాను ఏది మాట్లాడినా ఆలోచించే మాట్లాడ‌తాన‌ని ప‌వ‌న్ కల్యాణ్ అన్నారు. తాను దేశానికి, రాష్ట్రానికి ఏం చేయగలననే విషయాన్నే ఆలోచిస్తానని చెప్పారు.

బలహీనుల మీదే చట్టం బలంగా పనిచేస్తుందన్నారు. 60ఏళ్లకు గానీ నిర్భయ చట్టం తేలేకపోయారా అని ప్రశ్నించారు. కులాలు, మతాలకంటే ముందు మనం మనుషులమన్నారు. అర్ధరాత్రి కూడా ఆడపిల్లలు ధైర్యంగా బయటకు వెళ్లాలని తెలిపారు. ఆడపిల్లలను ఏడిపించే వారిని చెప్పుతో కొట్టండని సూచించారు.

రిజర్వేషన్లపై పవన్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. రిజర్వేషన్లపై తనకు స్పష్టత ఉందని.. రిజర్వేషన్లు లేక ఓసీలు ఎంత బాధపడుతున్నారో తెలుసన్నారు. రిజర్వేషన్‌ అంశం లోతైన సమస్య, రిజర్వేషన్‌ లేనివారికి ఆర్థిక సాయం అందించాలని అన్నారు.. రిజర్వేషన్లపై భవిష్యత్తులో ప్రజాదర్బారు పెడతానని వెల్లడించారు. . అసెంబ్లీ, పార్లమెంట్‌లో దీనిపై సమగ్ర చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.

Share.

Comments are closed.