ఓంపురి మరణం వెనుక మోడీ!

0

om-puri_apduniaసర్జికల్ స్ట్రైక్ తో పాకిస్థాన్ కు వెన్నులో వణుకు పుట్టింది. అప్పటి నుంచి మోడీ ఏం చేసిన పాకిస్థాన్ మీడియా ఆయనను విమర్శించడమే పనిగా పెట్టుకుంది. తాజాగా బాలీవుడ్ నటుడు ఓంపురి మరణంపై పాకిస్థాన్ మీడియాలో కొన్ని ఆశ్చర్యకరమైన వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఓంపురి మరణం వెనుక ప్రధాని మోడీ, జాతీయ సలహా భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హస్తం ఉందట. ఓంపురికి ఒళ్ళు తెలియనంత స్థాయిలో బలవంతంగా మద్యం తాగించి, ఆయన ముఖం మీద దిండు వేసి నొక్కి చంపేశారట…? ఈ పని చేసింది అజిత్ దోవల్ ప్రతినిధి అంట. పాకిస్తాన్ కు చెందిన బోల్ టీవీ అనే ఛానల్ ప్రసారం చేసిన ‘ఐసే నహీ చలేగా’ అనే హాస్యాస్పద కథనమిది. ఓంపురి పాకిస్థాన్ నటులకు మద్దతుగా మాట్లాడినందుకే ఆయనను హత్య చేశారని ఆ ఛానల్ పేర్కొంది. ఓంపురిని తన వద్దకు రావాల్సిందిగా దోవల్ ఆజ్ఞాపించారని, అక్కడకు వెళ్లిన ఆయనను బట్టలు ఊడదీసి చితక్కొట్టారని ఆ ఛానల్ అంటోంది. ఓంపురి మృతదేహంపై ఆయనను చంపిన ఆనవాళ్లు ఉన్నాయని చూసినట్టే చెప్పింది. మోడీ తదుపరి లక్ష్యం పాక్ నటుడు ఫవాద్ ఖాన్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అని ఆ ఛానల్ వార్తలను ప్రసారం చేసింది.

Share.

Comments are closed.