పొంగుతున్న వాగులు

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురిఅవుతున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని ఖర్జి గ్రామానికి చెందిన కాసర్ల సౌందర్య అనే గర్భిణి కి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రి కి తీసుకెళ్లడానికి 108 అంబులెన్స్ కి ఫోన్ చేసిన లాభం లేకుండా పోయింది. రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలం లోని లంబాడితండా ఎర్రవాగు ఉప్పొంగడంతో 108 డ్రైవర్ అంబులెన్స్ అక్కడి వరకు రావడానికి సాద్యం కాదు. వాగు ప్రవహిస్తుంది మీరు ఎలాగైనా అక్కడి వరకు తీసుకువచ్చి వాగు దాటిస్తే అక్కడి నుండి మేము ఆసుపత్రి కి తరలిస్తామని చెప్పడంతో గత్యంతరం లేక ఆటోలో తీసుకువచ్చినా వాగు ప్రవాహం చూసి వాగు దాటలేక, ఆసుపత్రి కి చేరుకోలేక రెండు గంటల పాటు ఆ తల్లి పురిటి నొప్పులతో తల్లడిల్లిపోయింది. చివరకి అక్కడ ఉన్న స్ధానికులు ధైర్యం చేయడంతో వారి సహాయంతో చేతుల మీద ఆ గర్బిణి ని వాగు దాటించగా అక్కడి నుండి 108 అంబులెన్స్ లో నెన్నెల మండల కేంద్రంలోని ఆసుపత్రి కి తరలించారు. సౌందర్య ఆడబిడ్డ కు జన్మనివ్వగా ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com