తెలంగాణలో ఆర్గన్ డొనేషన్ అండ్ బ్రెయిన్ డెత్ సర్టిఫికేషన్

ప్రధానంగా వైద్యారోగ్య శాఖలో పెనుమార్పులు తీసుకొస్తుండటంతో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందుతున్నాయి. ఇందులో భాగంగా చనిపోయిన వ్యక్తి అవయవాలను ఆపదలో ఉన్నవారికి అమర్చితే మరో ప్రాణం నిలబడుతుందని సంకల్పించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా ప్రధాన సర్కార్ దవాఖానలలో హ్యూమన్ ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్‌ను నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఉత్తర తెలంగాణకు పెద్దదైన ఎంజీఎం దవాఖానలో మానవ అవయవాల మార్పిడి కోసం ప్రత్యేక యూనిట్‌ను తెరవాలని ప్రభుత్వం సంకల్పించినట్లు తెలిపారు. అయితే ప్రమాదాలు, ఇతరత్ర కారణాలతో చనిపోయే పరిస్థితిలో ఉండే రోగుల నుంచి అవసరమైన అవయవాలను తీసి ఆపదలో ఉండే రోగులకు అమర్చినట్లయితే కొన్ని ప్రాణాలనైనా నిలబెట్టవచ్చనే ఉద్దేశ్యంతో రాష్ట్రప్రభుత్వం సర్కార్ దవాఖానల్లో ఆర్గన్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులకు తెలిపారు. ఇందుకోసం దవాఖానలో ప్రత్కేక వార్డు కోసం అనువైన స్థలాన్ని సేకరించాలని సూచించినట్లు తెలిపినట్లు సమాచారం. ప్రధానంగా చివరి దశలో కొట్టుమిట్టాడే రోగులకు అందించే చికిత్స ప్రత్యేక వార్డులకు సమీపంలో యూనిట్‌ను ఏర్పాటుచేయాలని భావించినట్లు సమాచారం.స్టేట్ ఆర్గన్ డొనేషన్ అండ్ బ్రెయిన్ డెత్ సర్టిఫికేషన్ కోఆర్డినేషన్ టీమ్‌కు చెందిన ప్రత్యేక వైద్యుల బృందం ఎంజీఎం దవాఖానను సందర్శించింది. వీరిలో డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ మంజూషతోపాటు మరి కొందరున్నారు. వారు నేరుగా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావును కలిసి ఈ విషయమై చర్చించారు. ఇదిలాఉంటే ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రోగుల నుంచి నేత్రాలు సేకరిస్తున్న పద్ధతిలోనే మనిషిలో అవసరమైన అవయవాలను వారి కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు సేకరించాలనేది సర్కార్ అభిప్రాయమని తెలిపినట్లు తెలిసింది. ఇందుకోసం రోగుల కుటుంబ సభ్యులను సామాజికంగా మేలుకొల్పేందుకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కూడా ఇవ్వాలని యోచించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com