ఆన్ లైన్ పంచాయతీ (నల్గొండ)

ప్రస్తుతం మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌, పట్టణాభివృద్ధి సంస్థలకే పరిమితమైన ఆన్‌లైన్‌ అనుమతులు ఇక నుంచి గ్రామీణస్థాయిలోని పంచాయతీల్లోనూ అమల్లోకి రానున్నా యి.. పంచాయతీల్లో పౌరుల సేవలకు సంబందించిన ప్రతి ధ్రువీకరణ, అనుమతులు ఆన్‌లైన్‌ద్వారా మంజూ రు చేయడం ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా సత్వర సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభు త్వం స్థానిక సంస్థల పాలనాతీరులో పలు సంస్కరణ లు తీసుకురావడానికి ఏప్రిల్‌ 18, 2018 నుంచి అమలులోకి తీసుకువచ్చిన కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో ఆన్‌లైన్‌సేవలకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకోవాలని నిర్దేశించారు. దీని ప్రకారం పంచాయతీల్లో అన్ని దశల్లోనూ ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ పంచాయతీల్లో అన్ని అనుమతుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది.

ఈ వెబ్‌సైట్‌లో పౌరులకు అవసరమైన ఇళ్లస్థలాల లేఅవుట్‌ అభివృద్ధి అనుమతులు, ఇంటి నిర్మాణాలకు అనుమతుల వంటి వాటికోసం వెబ్‌సైట్‌ లో దరఖాస్తులు, కావాల్సిన పత్రాలు అప్‌లోడ్‌ చేయ డం ద్వారా కాలయాపన లేకుండా సత్వర సేవలు త్వరలోనే గ్రామాల్లో అందుబాటులోకి వస్తాయని పంచాయతీరాజ్‌ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో రియల్‌ ఎస్టేట్‌ రంగం గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ముఖ్యంగా నగర శివారు జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాని అనేక పంచాయతీల్లో పెద్దఎత్తున ఇళ్ల స్థలాల అభివృద్ధి, లేఅవుట్లు వెలుస్తున్నాయి. అయితే వీటిలో అనుమతులు పొందిన వాటి కంటే.. అనుమతులు లేనివే ఎక్కువగా ఉంటున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు 945 లేఅవుట్లు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే వీటిలో 217 మాత్రమే అనుమతు లు తీసుకున్న లేఅవుట్లు ఉండగా, 728 లేఅవుట్లు ఎటువంటి అనుమతులు లేకుండానే అభివృద్ధి చేశారు. అయితే లేఅవుట్లు అనుమతులు తీసుకోవడంలో నిబంధనల కంటే మంజూరు చేసే డీటీసీపీ, గ్రామ పంచాయతీల్లో అవినీతి అక్రమాల కారణంగా రియల్టర్లకు ఎదురవుతున్న ఇబ్బందులు ఎదురైతున్నట్టు, ఈ కారణంగానే అక్రమ లేఅవుట్లు ఎక్కువగా పుట్టుకొస్తున్నట్టుగా ప్రభుత్వ పరిశీలనలో వెలడవు తోంది. పంచాయతీల్లో భవన నిర్మాణ అనుమతులకు కూడా ముడుపులు ముట్టచెప్పనిదే పనులు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం ఇళ్ల స్థలాల లేఅవుట్ల అభివృద్ధి, భవన నిర్మాణాల అనుమతులకు డీటీసీపీ, గ్రామ పంచాయతీల చుట్టూ దస్త్రాలతో ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల అభివృద్ధికి నిబంధనల మేరకు డీటీసీపీ, పంచాయతీల అనుమతులు లేకుండా లేఅవుట్లు చేస్తున్నారు. వీటిలో కొనుగోలు చేసిన వారు కూడా బ్యాంకు రుణాలు, మౌలిక సదుపాయాలను పొందడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గ్రామాల్లో పారదర్శకత పాటించడానికి ఆన్‌లైన్‌లోనే అనుమతులు మంజూరు చేయడమే పరిష్కారంగా భావిస్తున్నారు. ఇందు కోసం రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాల కోసం ఆన్‌లైన్‌ అనుమతుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ సిద్ధం చేశారు. ఈ సాఫ్ట్‌ వేర్‌ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే పంచాయతీల్లో ఆన్‌లైన్‌ అనుమతులు అమలు చేయనున్నారు.

గ్రామీణ పాలనా వ్యవస్థలో పలు సంస్కరణలు అమలులోకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పంచాయతీరాజ్‌ చట్టం పకడ్బందీగా అమలుకు ఆన్‌లైన్‌ అనుమతులు, పారదర్శకత దోహదపడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.. ఈ చట్టంలో భవన నిర్మాణ అనుమతులకు కాలవ్యవధి నిర్దేశించి, ఆలోపు ఇవ్వక పోతే అనుమతులు మంజూరీ అయినట్టుగానే భావించాలని చట్టం చెబుతోంది. గ్రామ పంచాయతీల్లో 300చదరపు మీటర్ల ఇంటిస్థలంలో గ్రౌండ్‌+2 అంతస్తులు భవన నిర్మాణానికి దరఖా స్తు చేసుకున్న 24 గంటలలోపు పంచాయతీ కార్యదర్శి పరిశీలించి పత్రాలు సరిగా ఉన్నాయా లేదా ధ్రువీకరించాలి.. పత్రాలు సక్రమంగా ఉంటే 15 రోజుల్లో అనుమతి ఇవ్వాలి. ఽసరియైున పత్రాలు జతచేయకుంటే ఏడు రోజుల్లో లిఖిత పూర్వకంగా తెలపాలి. పత్రాలు లేకపోవడంతో సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తే 15రోజుల తర్వాత భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు అ యినట్టుగానే భావించి దరకాస్తుదారులు నిర్మాణం ప్రారంభించుకునే వెసులుబాటు కల్పించారు.

గ్రామాల్లో లేఅవుట్లు, భవన నిర్మాణాలకు ఆన్‌లైన్‌ అనుమతులకు ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి తీసుకువస్తున్నప్పటికీ.. అమలు చేయడానాకి పంచాయతీల్లో కంప్యూటర్లు, ఇంటర్‌నెట్‌ సౌఖర్యం ప్రధాన అడ్డంకిగా మారనుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 401 గ్రామ పంచాయతీలను పాలనా సౌలభ్యం కోసం 128 క్లస్టర్లుగా విభజించారు. నాలుగు నుంచి అయిదు పంచాయతీలను ఒక క్లస్టర్‌ పరిధిలోకి తీసుకువచ్చినప్పటికీ.. క్లస్టర్‌ పరిధిలోని గ్రామాల పాలనా వ్యవహారాలు పర్యవేక్షించడానికి అవసరమైన పంచాయతీల కార్యదర్శుల కొరత ఉంది. జిల్లాలో కేవలం 94మంది కార్యదర్శులే 128 క్లస్టర్ల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ పంచాయతీల్లో కస్టర్‌ కేంద్రాల్లో కూడ కంప్యూటర్లు అందుబాటులో లేవు.

చాలా గ్రామాల్లో అసలు ఇంటర్‌నెట్‌ సిగ్నల్‌ కూడ ప్రధాన సమస్య.. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమిస్తామని ప్రకటిస్తున్నందున సిబ్బంది కొరత అధిగమించినప్పటికీ.. కంప్యూటర్లు, ఇంటర్‌నెట్‌ సదుపాయం లేకపోవడం ఆన్‌లైన్‌ సేవల అమలుకు పెద్ద ఆటంకంగా మారే అవకాశాలు ఉన్నాయని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం కంప్యూటర్లు, ఇంటర్‌నెట్‌ సౌఖర్యం గల పంచాయతీలకు ప్రాధాన్యం ఇచ్చి మొదటి విడతగా ఆన్‌లైన్‌ అనుమతులు మంజూరు చేయడానికి ఉత్తర్వులు జారీ చేస్తుందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com