ఎన్సిఆర్ఎంపి ప్రాజెక్టు పనులన్నీవచ్చేనెలాఖరుకు పూర్తి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్.

రాష్ట్రంలో నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టుఎర్లీ వార్నింగ్ డిస్సిమినేషన్ సిస్టమ్ ప్రాజెక్టుల కింద చేపట్టిన వివిధ పనుల ప్రగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సమీక్షించారు.ఈమేరకు గురువారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతోపాటు సంబంధిత శాఖల అధికారులతో ఈప్రాజెక్టు పనుల ప్రగతిని ఆయన సమీక్షిస్తూ పనులన్నిటినీ సెప్టెంబరు నెలాఖరుకు పూర్తిచేయాలని ఆదేశించారు.ఈప్రాజెక్టు పనులు పూర్తిచేసేందుకు నిర్దేశించిన గడువు ఇప్పటికే పూర్తయినందున పెండింగ్ లోఉన్న పనులన్నిటినీ సెప్టెంబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ప్రపంచ బ్యాంకు ఆర్ధిక సహాయంతో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ –ఇన్-ఎయిడ్ ప్రాజెక్టుగా ఎన్సిఆర్ఎంపి ప్రాజెక్టు కింద సవరించిన అంచనా ప్రకారం సుమారు 1339కోట్లతో ఈప్రాజెక్టును రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతోందని అన్నారు.కావున నిర్దేశిత గడువు ప్రకారం పనులన్నిటినీ పూర్తి చేయాలని ఆదేశించారు. 5ప్రధాన వంతెనల నిర్మాణ పనులు పూర్తికాగా వాటికి అప్రోచ్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆర్ అండ్ బి,పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్లు వివరించగా ఆయా పనులకు సంబంధించి పొటోలతో సహా వచ్చే సోమవారం తనకు చూపించాలని సిఎస్ ఆదేశించారు.అదే విధంగా ఎర్లీ వార్నింగ్ డిస్సిమినేషన్ సిస్టమ్ కింద చేపట్టిన టవర్ల నిర్మాణ పనులను వచ్చేనెల 15లోగా పూర్తి చేయాలని సిఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమీషనర్ శేషగిరి బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఎన్సిఆర్ఎంపి కింద 1198 కోట్ల రూ.ల వ్యయంతో 734 పనులు చేపట్టగా ఇప్పటికే 718 పనులు పూర్తిచేయగా మరో 7పనులు ప్రగతిలో ఉండగా 9పనులను తొలగించడం జరిగిందని వివరించారు.చేపట్టిన పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా ప్రతిపనికి నిర్దేశిత గడవును పెట్టామని తెలిపారు.ఇడబ్ల్యుడిఎస్ సిస్టమ్ కింద 118 ప్రాంతాల్లో 30మీటర్ల ఎత్తున టవర్ల నిర్మాణం చేపట్టగా ఇప్పటికే 104 పూర్తికాగా మిగతా 14 ప్రగతిలో ఉన్నాయని తెలిపారు.వాటి ద్వారా ఆయా ప్రాంతాల్లో ఎప్పుడు పిడుగులు పడే అవకాశం ఉందనేది ముందస్తుగా ప్రజలకు తెలియజేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.జాతీయ విప్తత్తుల నిర్వహణ సంస్థ(NDMA)ప్రాజెక్టు డెరైక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాలు సహా మొత్తం 153 ప్రాంతాల్లో అలర్ట్ సైరన్ విధానాన్ని అందుబాటులోకి తేవడం జరుగుతోందన్నారు. ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్ మెహన్ సింగ్,మత్స్యశాఖ అదనపు సంచాలకులు కె.సీతారామ రాజు,ఆర్ అండ్ బి,పంచాయితీ రాజ్ చీఫ్ ఇంజనీర్లు,ఎల్అండ్ టి ప్రతినిధులు,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com