జయ సమాధి పక్కనే…

కరుణానిధి అంత్యక్రియలను చెన్నైలోని మరీనా బీచ్‌లో నిర్వహించడానికి కోర్టు అంగీకరించడంతో ఆయన తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బోరున విలపించారు. మాజీ కేంద్ర మంత్రి ఎ రాజా హైకోర్టు నిర్ణయాన్ని స్టాలిన్‌కు వివరించారు. అది వింటూనే స్టాలిన్ కంటతడి పెట్టారు. కోర్టు తీర్పు తర్వాత డీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున కరుణానిధిని కీర్తిస్తూ నినాదాలు చేశారు. కలైంగర్‌ను అన్నా మెమొరియల్ దగ్గరే ఖననం చేయడానికి అనుమతించాలన్న డీఎంకే వినతిని మద్రాస్ హైకోర్టు అంగీకరించింది.
మిళ రాజకీయాల్లో బద్ధ శత్రువులు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శతృత్వం ఇద్దరి మధ్య ఉంది. అలాంటిది ఇప్పుడు ఆ జయలలిత సమాధి పక్కనే కరుణానిధి కూడా శాశ్వతంగా విశ్రాంతి తీసుకోబోతున్నారు. డీఎంకే పార్టీ దగ్గర ఉన్న ప్లాన్ ప్రకారం కరుణానిధిని ఖననం చేసే చోటు ఆయన గురువు అన్నాదురై, జయలలిత సమాధుల మధ్య ఉంది. మొదట్లో మరీనా బీచ్‌లో కరుణానిధి ఖననానికి తమిళనాడు ప్రభుత్వం అంగీకరించని విషయం తెలిసిందే. దీంతో డీఎంకే మద్రాస్ హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంది. డీఎంకేకు చెందిన ఆరెస్ భారతి ఇచ్చిన ప్లాన్ ప్రకారమే ఖననం చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. తమిళ రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత మధ్య దశాబ్దాల పాటు వైరం కొనసాగింది. ఇప్పుడు వైరిపక్షం అన్నాడీఎంకేనే అధికారంలో ఉండటం, మెరీనా బీచ్‌లో ఖననానికి అనుమతి ఇవ్వకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. గాంధీ మండపం దగ్గర ప్రత్యేకంగా రెండెకరాల స్థలం ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించినా డీఎంకే అంగీకరించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com