డ్రగ్స్ కేసులో కొత్త కోణం

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ వ్యవహారం మరువక ముందే తాజాగా మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపింది. సరిగ్గా రెండ్రోజుల క్రితం డ్రగ్స్ ముఠాను పట్టుకున్న పోలీసులు సుధీర్ఘంగా విచారణ చేపడుతున్నారు. ఈ కేసులో గంటకో కొత్తకోణం వెలుగు చూస్తోంది. నగరానికి చెందిన 50 మంది పారిశ్రామికవేత్తల పిల్లలు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరందర్నీ త్వరలో విచారణకు పిలిచేందుకు ఎక్సైజ్‌శాఖ రంగం సిద్ధం చేస్తోంది. రెండ్రోజుల్లో రెండు డ్రగ్ మాఫియా ముఠాలను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. కాగా డ్రగ్ డీలర్ అబ్దుల్‌కు పెద్ద మొత్తంలో కస్టమర్లు ఉన్నట్లు విచారణలో నిజాలు బయటపడ్డాయి. మొత్తం 200మందికి డ్రగ్ సరాఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. అబ్దుల్ కాల్‌డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఆ కాల్‌డేటాలో ఎవరెవరున్నారు..? ఆ పారిశ్రామికవేత్తల పిల్లలు ఎవరు? అనే విషయాలు పోలీసులు ఆరాతీస్తున్నారు.ఇదిలా ఉంటే.. డ్రగ్స్ అమ్ముతూ అమెజాన్ ఉద్యోగి ఎక్సైజ్ శాఖకు చిక్కారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి ప్రణవ్ డ్రగ్స్ తెప్పిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. డ్రగ్స్‌కు కోడ్ భాషలు పెట్టి ఎవరికీ తెలియకుండా విక్రయిస్తున్నట్లు తేలింది. కాగా హైదరాబాద్‌లో డ్రగ్స్ ఎప్పుడు అమ్ముడుబోతున్నాయ్..? డ్రగ్స్ కొన్న తర్వాత ఎక్కడికిపోతున్నాయ్..? ఏయే పబ్‌లకు డ్రగ్స్ వెళ్తున్నాయ్..? పబ్‌కు వెళ్లే ముందు జూబ్లిహిల్స్‌లోని యూత్ ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారని అధికారులు తేల్చారు. మొత్తానికి చూస్తే ఈ వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. సుధీర్ఘ విచారణ అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *