కేటీఆర్ పై నేరెళ్ల శారదా ఫైర్

మంత్రి కెటీఆర్ పై మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేరెళ్ల శారదా నిప్పులు చెరిగారు.. కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదన్నారు. కేటీఆర్ మంత్రిగా అనర్హుడని అన్నారు.మహిళా సదస్సుతో టీఆర్ఎస్ గుండెలో గుబులు పట్టుకుందని…దింతో మహిళా సంఘాలకు రూ. 930 కోట్లు విడుదల చేశారని శారదా అన్నారు.ఇది మహిళా కాంగ్రెస్ విజయమని…మరో 930 కోట్లు త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి సునీత లక్ష్మ రెడ్డి భర్త వర్ధంతి రోజున బ్లడ్ డొనేషన్ నిర్వహిస్తే 144 సెక్షన్ విధించడం దారుణమన్నారు.ప్రభుత్వ తీరు ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com