నీట్ ను తేల్చేశారు

నేషనల్‌ ఎంట్రెన్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నీట్‌)తోపాటు ఇతర ప్రవేశ పరీక్షలకు హాజరుకావజానికి సన్నద్దమవుతున్న విద్యార్థులకు ఇలాంటి పరిస్థితి ఆశనిపాతంగా మారుతున్నది. ఆందోళనకు గురిచేస్తున్నాయి. మానసికంగానూ దెబ్బతిస్తున్నాయి. నీట్‌ అనేది డాక్టర్‌ కావాలనుకువేవారి భవిష్యత్తుకు తొలిఅడుగు. ఇలాంటి విషయాల్లో అల్లాటప్పాగా పరీక్ష ఏడాదికి ఒకసారని.. కాదు రెండుసార్లని ప్రకటిస్తూ వారిని అయోమయానికి గురి చేస్తున్నది. దీంతో ఏ పరీక్ష రాయాలో.. ఎటువైపు వెళ్లాలో.. తమ భవిష్యత్తు ఏమిటో అనే సందిగ్ధం విద్యార్థుల్లో ఒకరకమైన భయాందోళన రేకిస్తున్నది. ఈ సారి నీట్‌కు తెలుగు రాష్ట్రాల్లో సుమారు లక్షన్నరకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. వచ్చేసారి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం నిర్ణయాలపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, దంత కళాశాలల్లో ప్రవేశానికి ఏడాదికి రెండుసార్లు ‘నీట్‌’ ప్రవేశ పరీక్షను నిర్వహించాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని అందువల్ల ఒకేసారి నిర్వహించడమే ఉత్తమమని నిర్ణయించింది. ముందుచూపు లేకుండా నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు ఇలాగే బెడిసికొడతాయని పలువురు విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, దేశంలో మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న నీట్‌ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి వివాదాలతో సతమతమవుతున్నది. ఈ నేపథ్యంలో నీట్‌ బాధ్యతను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ.. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అనే సంస్థకు అప్పగించింది. అడ్మిషన్లలో ఏటా జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నివారించేందుకు ఏడాదికి రెండుసార్లు అంటే, ఫిబ్రవరిలో ఒకసారి, మే నెలలో మరోసారి నీట్‌ పరీక్షను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అయితే, తక్కువ వ్యవధిలో నీట్‌ను రెండు మార్లు నిర్వహించడం వల్ల విద్యార్థులపై ఎనలేని భారం పడుతుందని, అది మానసిక ఒత్తిడికి, ఇతర సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉన్నదని, దాంతోపాటు ఇతర సాంకేతిక సమస్యలు కూడా పుట్టుకొస్తాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ భావించింది. నీట్‌ను 8 రోజుల పాటు ఉదయం, సాయంత్రం 16 సార్లు నిర్వహించాలంటే అందుకు రూపొందించిన కంప్యూటర్‌ ఆధారిత బుక్‌ బ్యాంకులు సరిపోవని, ఒకట్రెండు సంవత్సరాలు నీట్‌ నిర్వహించేసరికి వచ్చి ప్రశ్నలే మళ్లీ వస్తాయి. బుక్‌ బ్యాంకు కూడా ఖాళీ కావచ్చు. దీంతో రెండుమూడేండ్లు గడిచేసరికి ప్రశ్నల కొరత ఏర్పడే ప్రమాదమూ లేకపోలేదు. ఇంకో పక్క ప్రయివేటు కార్పొరేట్‌ శిక్షణ సంస్థలు బిట్లను సేకరించేందుకు నకిలీ అభ్యర్థులను రంగంలోకి దించుతాయని, పరీక్షకు హాజరై ఏ ప్రశ్నలు వచ్చాయో నమోదు చేసి ఇవ్వడానికి వారి ద్వారా ప్రయత్నాలు చేస్తారు. ఇదీ మరో సమస్యకు దారితీసే ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ అనుమానం వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా ఫిబ్రవరి పరీక్షకు అక్టోబర్‌ 1 నుంచి షెడ్యూలు ఖరారు చేశారు. పరీక్షలను ఫిబ్రవరి 3 నుంచి 17 వరకూ నిర్వహించాలని నిర్ణయించారు. వాటి ఫలితాలు మార్చిలో వస్తాయి. ఇది కూడా రాష్ట్రాల బోర్డులు నిర్వహించే పరీక్షలు, ప్రయోగ పరీక్షల షెడ్యూలుతో ఇబ్బంది అవుతుంది. సహజంగా ఆ సమయంలో బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతుంటాయి. అదే సమయంలో ప్రీ ఫైనల్‌ పరీక్షలను కూడా నిర్వహిస్తుంటారు. ప్రాక్టికల్‌ పరీక్షల ఒత్తిడి, నీట్‌ ప్రవేశపరీక్ష ఒత్తిడి వారిపై ఒకేసారి పడుతుంది. అదేవిధంగా మేలో నిర్వహించే నీట్‌కు మార్చి రెండో వారంలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఇంటర్‌ రెగ్యులర్‌ పరీక్షలు మొదలవుతాయి. మే 12 నుండి 20 వరకూ నీట్‌ నిర్వహించాలని షేడ్యూలు రూపొందించగా, అప్పుడే ఇంటర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోవిద్యార్థులు తీవ్ర మానసికి్తిడికి గురవుతారు. ఈ నేపథ్యంలో నీట్‌ను ఏడాదికి ఒకసారే నిర్వహించడం ఉత్తమమని కేంద్రం నిర్ణయించినట్టు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com