లడ్డు కావాలా… అంటూ అమ్మాయిల ఎర

హైద్రాబాద్ నగరంలోని బేగంపేట్ ఏరియాను టార్గట్ చేసిన వగలాడి, అమ్మాయిల ఫొటోలతో నగర యువతను మోసం చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. కాలనీ

వాసులు పోలీసులను అశ్రయించడంతో కేసు నమోదు చేసుకొని విచారించగా వివరాలు ఇలా ఉన్నాయి. లడ్డూ కావాలా? అంటూ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది దాన్ని తెరవ

గానే కవ్వించే అందమైన అమ్మాయి ఫొటో, వాట్స్ యాప్ నంబర్ కనిపి స్తాయి. దాన్ని చూసినవారు ఆశపడి స్పందిస్తే కాసేపటికే అయితే రూ. 3 వేలు, రాత్రికైతే రూ.7

వేలు ఫలానా ఖాతాలో జమ చేయాలన్న సందేశం వస్తుంది. ఆన్‌లైన్‌లో మాత్తమే డబ్బు చెల్లించాలని షరతు పెట్టి గూగుల్ మ్మాప్ ద్వారా ఫ్యామిలీస్ ఉండే లొకేషన్‌ను

చూపుతుండటం జరుగుతుంది. బేగంపేటలోని సదరు అపార్టు మెంట్‌లోని ఫలానా ఫ్లోర్‌కు వెళ్లాలని ఏ తలుపు తీసుంటే దానిలోకి నిర్భయంగా రావాలని చెబుతుంది.

ఆమె మాటలను నమ్మి అక్కడికి వెళ్లి ఇక ఎంజాయ్ చేద్దామని భావించిన వారు తాము ఫ్యామిలీస్ ఉంటున్న అపార్టుమెంట్‌కు వచ్చామని మోసపోయామని తెలుసు

కొన్న క్రమంలో వాగ్వాదాలు, అపార్టుమెం ట్‌లో ఉంటున్న వారికి బాధితులకు మధ్య ఘర్షణలు జరిగాయి.ఇలా ఒకరు, ఇద్దరు కాదు దాదాపు వంద మంది పగలు, రాత్రి

లేకుండా గంటకొకరు వచ్చి తలుపు కొడుతుంటే వారికి సమాధానం చెప్పలేక ఇంట్లోని మగవారు ఆఫీసులకు పోలేక కాపలా కాయడంతో, చివరకు అపార్టుమెంటు వాసుల

ఫిర్యాదు మేరకు అక్కడ పెట్రోలింగ్ వాహనాన్ని పెట్టారు. నెల రోజుల వ్యవధిలో 100 మందికి పైగా యువకులు వచ్చారు వారిని ఆరా తీసాము. అనంతరం 20

మందిపై కేసులు పెట్టాము. ఇకవగలాడి నంబరును ట్రేస్ చేస్తుంటే ఒక రోజు చెన్నైలో, మరో రోజు నాగపూర్, ఇంకో రోజు బెంగళూరులో ఉన్నట్టు చూపిస్తోంది అని కేసును

పర్యవేక్షిస్తున్న బేగంపేట సీఐ అశోక్‌రెడ్డి ఇప్పుడు సైబర్ క్రైమ్ ఏసీపీ చక్రవర్తిను ఆశ్రయించారు వెంటనే స్పందించిన పోలీసులు వైబ్‌సైట్‌ను తొలగించగా ఆమె మరో సైట్

సృష్టించడంతో సవాలుగా తీసుకొని సమాచారం సేకరించారు. సదరు మహిళా బెంగుళూరుకు చెందిన కిలాడీ అని గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *