మరో ప్రాజెక్ట్ కు నాని రెడీ

0
nani-apduniaవరుస విజయాలతో టాలీవుడ్ కు ఊపునిచ్చిన హీరో నాని. ప్రతీ పిక్చర్ లోనూ వైవిధ్యం చూపుతూ మంచి హిట్స్ సాధించాడు ఈ నేచురల్ స్టార్. ఓ వైపు సక్సెస్ నుంచి ఎంజాయ్ చేస్తూనే మరో సినిమాను పట్టాలెక్కించడంలో బిజీబిజీగా గడిపి ఈ ఏడాదిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘నేను లోకల్’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ‘జంటిల్మన్’ స్టార్ త్వరలోనే మరో చిత్రం ప్రారంభించనున్నాడు. నాని కొత్త సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్నాడు. నివేదా థామస్ కథానాయికగా నటించే ఈ సినిమాలో, ఆది పినిశెట్టి ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. నాని నటిస్తున్నాడు కాబట్టి ఈ మూవీ వైవిధ్య సబ్జెక్ట్ తోనే తెరకెక్కుతోందని ఫిల్మ్ నగర్ టాక్.
Share.

Comments are closed.