నాగార్జునసాగర్‌కు జల కల.. శ్రీశైలం నుండి వచ్చి చేరుతున్ననీరు

శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఆనకట్ట 8 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. మరో వంద టీఎంసీలు వస్తే నాగార్జునసాగర్‌ కూడా పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుతుంది. ప్రస్తుతం జలాశయానికి 2,94,239 క్యూసెక్కుల నీరు వస్తుండగా 3,19,948 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 883.30 అడుగులు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ 206.09 టీఎంసీలు కాగా పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు.కృష్ణానదిలో అటు ఆలమట్టికి, ఇటు తుంగభద్రకు వరద వస్తుండటంతో శ్రీశైలంలోకి ప్రవాహం నిలకడగా ఉంది. ప్రస్తుతం వస్తున్న వరద ఈ నెలాఖరు వరకు కొనసాగితే కృష్ణా బేసిన్‌లో అన్ని రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటిమట్టాలతో కళకళలాడతాయి. పులిచింతల దిగువన వచ్చిన వర్షంతో ప్రకాశం బ్యారేజీ నుంచి 33 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com