మోడర్న్ మాంత్రికుడిగా నాగ్…

0

ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజు గారి గది కి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కనుండగా ఇందులో సమంత, సీరత్ కపూర్ లు కీలక పాత్రలు పోషించనున్నారు. రాజుగారి గది మూవీకి సీక్వెల్ గా వస్తున్న రాజుగారి గది 2 హార్రర్ థ్రిల్లర్ చిత్రంలో నాగార్జున మాంత్రికుడి పాత్రలో కనిపిస్తాడు. ఈ మాంత్రికుడు పాతకాలపు మాంత్రికుడు కాదు. మోడర్న్ మాంత్రికుడు. నాగార్జున ఇలాంటి కేరక్టర్ వేయడం ఇదే ఫస్ట్ టైం.ఐదు పదుల వయస్సులోను కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస విజయాలు సాధిస్తున్న టాలీవుడ్ నవ మన్మధుడు నాగార్జున. మనం, ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయనా, ఓం నమో వెంకటేశాయ ఇలా వరుస హిట్స్ తో దూసుకెళుతున్న నాగ్ తన తదుపరి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. తాజాగా నాగ్ అందుకు సంబంధించి ఓ పోస్ట్ పెట్టాడు. రాజు గారి గది2 చిత్రం షూటింగ్ మొదలైందని చెబుతూ, టీం అందరికి తన బెస్ట్ విషెస్ అందించాడు.

Share.

Leave A Reply