ఛాతిని కోసి గుండెను తీసుకెళ్లిన ఘటన

0

కర్నూల్‌ నగరంలో దారుణ హత్య జరిగింది. ఓ యువకుడిని తుంగభద్ర నది ఒడ్డున దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. అంతేకాదు ఛాతిని కోసి గుండెను తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్‌స్వ్కాడ్‌తో తనిఖీలు చేశారు. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. మృతుడు సాయిబాబా సంజీవనగర్‌కు చెందిన చెన్నయ్యగా పోలీసులు గుర్తించారు. హత్యకు పాతకక్షలే కారణమా? లేక గుండె కోసం ఉద్దేశపూర్వకంగా చంపేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share.

About Author

Leave A Reply