మున్సిపల్ ఛైర్మన్లుగా ఎమ్మార్వోలు కుంటుపడుతున్న పాలన

ఆగస్టు 2 నుంచి కొత్త మున్సిపాల్టీలు అమలులోకి వచ్చాయి. అయితే మున్సిపాల్టీల్లో పని చేయడానికి అవసరమైన వ్యవస్థను మాత్రం ఏర్పాటు చేయలేదు. మున్సిపాల్టీలల్లో టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ, పన్నులు వసూళ్లు కీలకంగా ఉంటాయి. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే ఉపాధి అవకాశాలతో కోసం పరిశ్రమలు స్థాపించాల్సి ఉంది. రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, శ్మశానవాటికలు, ఆస్పత్రులు, వీధిలైట్లు, సరిపడా తాగునీటి సరఫరా, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణ విస్తరణకు కావాల్సిన ముందుస్తు చర్యలు తీసు కోవడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. దీనికి అను గుణంగా చెత్త నిర్వహణ, డంపింగ్‌ యార్డుల ఏర్పాటు కూడా సర్కారుకు సవాల్‌గా మారింది. అందుకు భూసేకరణ, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడం కూడా మున్సిపాల్టీలలో అతిముఖ్యమైన పని. తాత్కాలిక సిబ్బందితో కాలం గడుపుతున్నారు. కొన్ని చోట్ల పంచాయతీరాజ్‌, రెవెన్యూ అధికారులకు బాధ్యతలు అప్పగించింది. ఎమ్మెర్వోలు, ఎంపీడీఓలతో ప్రత్యేక అధికారులు పాలన కొనసాగుతున్నది. పంచాయతీల సిబ్బందితో కొత్త మున్సిపాల్టీలలో విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. తెలంగాణలో 70 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తుందని, ఉపాధి కరువై నగరాలకు వలసలు పోతున్నారని, అందుకనుగుణంగా కొత్త మున్సిపాల్టీలు ప్రకటిస్తున్నట్టు సర్కారు చెబుతున్నది. అనుకున్నదే తడవుగా ఆమౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పించడంతోపాటు రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వంటి సౌకర్యాలు కల్పించి పౌరులకు మెరుగైన జీవితాన్ని కల్పించడానికి మున్సిపాల్టీలు ఉపయోగపడతాయని ప్రభుత్వం పేర్కొన్నది. పాత మున్సిపాల్టీలు 73 ఉంటే…కొత్తగా మరో 72 మున్సిపాల్టీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మున్సిపాల్టీలలో అన్ని పనులు సవ్యంగా సాగాలంటే 2వేల పోస్టులు అదనంగా అవసరం ఉందని మున్సిపల్‌ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. కనీసం ఒక్కొక్క మున్సిపాల్టీలకి 30 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అవసరం ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ నుంచి ఆఫీస్‌ సబార్డినేటర్‌ స్థాయి వరకు సిబ్బంది అవసరం ఉంటుంది. టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ అధికారులు తక్షణావసరం. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో ఉలుకూ, పలుకూ లేదు. పంచాయతీ నుంచి మున్సిపాల్టీకి అప్‌్‌గ్రేడ్‌ అయ్యాక స్థానిక ఎమ్మార్వో, లేక ఎంపీడీఓలు ప్రత్యేక అధికారులుగా నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి వారికి ఎలాంటిి అధికారాలు లేకుండానే ఉత్సవ విగ్రహాల్లా కొనసాగుతున్నారు. మున్సిపాల్టీలను ఎంత శరవేగంగా ప్రకటించిందో అంతే వేగంగా నియామకాలను చేయకపోవడంతో పరిపాలన సాగడం లేదు. కొత్త మున్సిపాల్టీల ఏర్పాటుకు గతేడాది నుంచి కసరత్తు ప్రారంభించి, మార్చి 29న అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం లభించింది. ఆగస్టు 2న కొత్త మున్సిపాల్టీలు అమలులోకి వస్తున్నట్టు ప్రకటించింది. కాగా అందుకు కావాల్సిన సిబ్బందిని నియమించకపోవడంతో మున్సిపాల్టీల అభివృద్ధి స్థంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పురపాలక శాఖ మున్సిపాల్టీలలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. సిటిజన్‌చార్ట్‌, ఆన్‌లైన్‌ సేవలు, భూ సంబంధమైన అనుమతులు, బిల్డింగ్‌ అనుమతులతోపాటు పౌరసేవలు కోసం ఆన్‌లైన్‌ ద్వారా వ్యవహారాలు నడుపుతున్నారు. స్వచ్ఛ తెలం గాణలో భాగంగా బహిరంగ మలవిసర్జన రహితగా పట్ట ణాలుగా తీర్చిదిద్దాలని సర్కారు సంకల్పించింది. ప్రతి ఇంటి కి మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది. ఇవన్నీ సమ కూర్చడానికి కొత్త మున్సిపాల్టీలకు సిబ్బంది, నిధులను ఇప్ప టి వరకూ సమకూర్చలేదని అధికారులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com